Naga Chaitanya : సాయిపల్లవితో కలిసి నటించిన లవ్ స్టోరీతోపాటు కృతిశెట్టితో నటించిన బంగార్రాజు చిత్రాలు హిట్ అయ్యే సరికి అక్కినేని నాగచైతన్య మంచి జోరు మీదున్నాడు. ఈ క్రమంలోనే చైతూ ప్రస్తుతం థాంక్ యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రష్యాలోని మాస్కోలో జరుగుతోంది. మూవీకి చెందిన చివరి షెడ్యూల్‌ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో చైతన్య పక్కన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా చైతన్య, రాశిఖన్నాలు తాము తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. ఇక తాజాగా చైతూ ఇంట్రెస్టింగ్ లుక్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్.. చైతూను ప్రొఫైల్ ఫొటో తీశారు. అందులో చైతన్య అద్దాలు ధరించి.. దట్టమైన గడ్డంతో.. స్పోర్ట్ లుక్‌లో మెరిసిపోతున్నాడు.
ఇక ఈ ఫొటోను షేర్ చేసిన చైతూ.. పీసీ సర్, థాంక్ యూ ది మూవీ అని కామెంట్ పెట్టాడు. ఈ క్రమంలోనే చైతూ కొత్త లుక్ ఫొటో వైరల్‌గా మారింది. ఈ లుక్‌ను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కాగా థాంక్ యూ మూవీకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. బీవీఎస్ రవి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…