Samantha : టాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా ఉన్న సమంత, నాగచైతన్య గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వీరిద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఈ విషయాన్ని వేర్వేరుగా ప్రకటించారు. దీంతో ఈ విషయం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. అసలు వీరు ఎందుకు విడిపోదామనుకున్నారో తెలియక చాలా మంది ఇప్పటికీ అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగచైతన్యపై తనకు ఎంత కోపం ఉందనే విషయాన్ని సమంత పరోక్షంగా తెలియజేసింది. ఇటీవలే కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొన్న ఈమె కనీసం చైతన్య పేరును పలికేందుకు కూడా ఇష్టపడలేదు. పైగా తమ విడాకులు అంత కూల్ గా ఏమీ అవలేదని తెలిపింది. అంటే.. విడాకుల కోసం వీరి మధ్య పెద్ద యుద్ధమే జరిగినట్లు ఈ అమ్మడు చెప్పకనే చెప్పింది. దీంతో సమంత కామెంట్స్ వైరల్ అయ్యాయి.
అయితే సమంత వ్యాఖ్యలకు అక్కినేని కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. కనీసం ఆమె కామెంట్స్‌ను ఖండించలేదు. వారందరూ.. ఆఖరికి చైతన్య కూడా సమంత కామెంట్స్‌పై ఏమీ మాట్లాడలేదు. అయితే ఇదిలా ఉండగా.. తాజాగా ఒక వార్త దుమారం రేపుతోంది. ఓ బాలీవుడ్ హీరో వల్లే సమంతకు చైతన్య విడాకులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ రెచ్చగొట్టడం వల్లే చైతన్య సమంతకు విడాకులు ఇచ్చాడని ఓ వార్త వైరల్ అవుతోంది.
చూడు బ్రదర్.. నీకు సమంతకు, సెట్ కాదు, నా మాట విను.. నీ మనస్సు అంతా చీకటిగా ఉంది.. నువ్వు విడాకులు ఇవ్వడమే కరెక్ట్.. అని అమీర్‌ఖాన్.. చైతన్యతో అన్నాడట. దీంతో చైతూ సమంతకు విడాకులు ఇచ్చాడట. అలా అని చెప్పి ఒక వార్త అయితే తెగ వైరల్ అవుతోంది. అయితే దీన్ని పోస్ట్ చేసింది మరెవరో కాదు.. బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్. ఈయన ఎల్లప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటాడు. తన దగ్గర అమీర్‌ఖాన్, నాగచైతన్యలకు చెందిన స్టోరీ మొత్తం ఉందని.. చైతన్య విడాకులకు అమీర్‌ఖానే కారణమని ఆయన అన్నారు. దీంతో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…