Naga Chaitanya : సమంతకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి నాగచైతన్య సైలెంట్‌గానే ఉంటున్నాడు. అంతకు ముందు సోషల్ మీడియాలో చైతూ ఏదో ఒక అప్‌డేట్ పోస్ట్ చేస్తుండేవాడు. కానీ విడాకుల ఇష్యూ అనంతరం సోషల్ మీడియాలోనూ చైతన్య పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. తన సినిమాలేవో తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే లవ్‌స్టోరీ సక్సెస్ అనంతరం బంగార్రాజుతో చైతూ రెండో హిట్ కొట్టాడు. ఇక త్వరలోనే థాంక్ యూ అనే మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలోనే చైతూ హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే థాంక్ యూ సినిమాకు సంబంధించి తాజాగా అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీకి చెందిన టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.
థాంక్ యూ సినిమాకు చెందిన టీజర్‌లో చైతన్య చెప్పిన ఓ డైలాగ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, ఎన్నెన్నో వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను.. అని చైతూ అంటాడు. అయితే ఇది తన మాజీ భార్య సమంతను ఉద్దేశించి అన్న డైలాగేనని చైతూ ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటి వరకు సమంతకు కౌంటర్ వేసేందుకు చైతూ నుంచి పెద్దగా డైలాగ్స్ ఏమీ లేవు. సమంతనే సోషల్ మీడియాలో పెడుతున్న సందేశాల వల్ల ఆమె ఫ్యాన్స్ వాటిని పట్టుకుని చైతూను విమర్శిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ చాన్స్ చైతూ ఫ్యాన్స్‌కు దక్కింది. దీంతో వారు రెచ్చిపోతున్నారు. థాంక్ యూ చిత్రంలో చైతన్య అన్న డైలాగ్ సమంతను ఉద్దేశించి పెట్టిందేనని.. వారు సంబరపడుతున్నారు. అయితే నిజంగానే ఆ డైలాగ్ సమంతను ఉద్దేశించి పెట్టినా పెట్టకపోయినా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఆ డైలాగ్ చైతన్యకు సరిగ్గా సరిపోతుందని.. దీంతో ఆ డైలాగ్ సమంతకు చెంప దెబ్బలా మారిందని కొందరు అంటున్నారు.
ఇక థాంక్ యూ సినిమాకు మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించగా.. ఇందులో రాశిఖన్నా.. అవికాగోర్‌లు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీలో చైతన్య స్వార్థపూరిత వ్యక్తిగా మొదట కనిపించనున్నాడట. తరువాత తన తప్పు తెలుసుకుని తనను తాను సరిదిద్దుకుంటాడట. ఈ క్రమంలోనే ఈ ఒక్క టీజర్‌తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. ఇక ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ అయ్యే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…