Naga Babu : రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. పవన్, జనసేన అభిమానులు ఓ వైపు.. వైసీపీ అభిమానులు మరోవైపు ఉండి మాటల యుద్ధం చేస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి హీట్ పెరిగింది. ఈ క్రమంలోనే పోసాని వ్యాఖ్యలపై ఇప్పటికే అభిమానులు భగ్గమంటూ ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.
ఇక మెగా డాటర్ నిహారిక కూడా పోసాని వ్యాఖ్యలకు కౌంటర్ వేసింది. పోసానికి పిచ్చి పట్టిందని, ఆయనను వెంటనే మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలని, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే నాగబాబు కూడా ఈ విషయమై అభిమానుల ముందుకు వచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన అభిమానులతో ముచ్చటించారు. ఆస్క్ మీ.. పేరిట ఆయన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగే ప్రశ్నలకు నాగబాబు సమాధానాలు చెబుతూనే మరోవైపు మీమ్స్, క్లిప్స్, ఫొటోలతో సెటైర్లు వేశారు. అనేక ప్రశ్నలకు ఆయన మీమ్స్ ద్వారానే సమాధానాలు చెప్పారు. ఏపీలో ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మడంపై నాగబాబు సెటైర్ వేశారు. రవితేజ, బ్రహ్మానందం నటించిన విక్రమార్కుడు సినిమాలోని ఓ క్లిప్‌ను ఆయన షేర్ చేశారు. ఆ విధంగా ఏపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆయన పరోక్షంగా చెప్పారు.
ఇక మంత్రి పేర్ని నానిపై కూడా ఘాటుగా సెటైర్ వేశారు నాగబాబు. మంత్రి పేర్ని నాని ప్రపంచం ఇదే.. అంటూ చెత్త కుప్ప ఫొటోను నాగబాబు షేర్ చేశారు. ఏపీని అమ్మేసి వచ్చే డబ్బులతో మంత్రి పేర్ని నానికి వైద్యం చేయిద్దాం అంటూ.. ఘాటుగా విమర్శించారు.
అలాగే ఆన్‌లైన్ మూవీ టిక్కెట్ల అమ్మకంపై అడిగిన ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ.. కంటెంట్ ఉన్నవాడికి కటౌట్‌తో పనిలేదని అన్నారు. పోసాని గురించి ఒక్క మాటలో సమాధానం చెప్పాలని అడగ్గా.. అందుకు నాగబాబు స్పందిస్తూ.. సమరసింహారెడ్డిలోని ఒక ఫొటో షేర్ చేశారు. బాలయ్య చెప్పినట్లుగా కుక్కలు మొరిగాయని అనుకో.. అంటూ నాగబాబు సమాధానం ఇచ్చారు.
కాగా మీరు ఏ బ్రాండ్ మందు తాగుతారని అడగ్గా.. అందుకు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను షేర్ చేశారు. గుండెల్లో గోదారి ఫంక్షన్‌లో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను నాగబాబు షేర్ చేశారు. ఇలా రోజు రోజుకీ మాటల యుద్ధం పెరిగిపోతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…