Nabha Natesh : ఇటీవలి కాలంలో బాగా ట్రెండ్ అయిన సాంగ్ ఏంటి అంటే.. బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు సాంగ్. తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డె జంటగా నటిస్తున్న చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి విడుదలైన అరబిక్ కుతు సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ పాటకు ప్రముఖ హీరో శివ కార్తికేయన్ తమిళం, అరబిక్ పదాలతో లిరిక్స్ అందించారు. అయితే ఈ పాటకు నెటిజన్స్‌తోపాటు అనేక మంది సెలబ్రిటీలు స్టెప్పులేశారు.
ఈ పాపులర్ సాంగ్‌కి జానీ మాస్టర్ స్టెప్పులు వేయగా చాలా మంది సెలబ్స్ తమదైన శైలిలో డ్యాన్స్ చేశారు. సమంత, కీర్తి సురేష్, రష్మిక ఇలా చాలా మంది డ్యాన్స్ చేశారు. తాజాగా నభా నటేష్ తన గ్యాంగ్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. కాస్త లేట్ అయినా కూడా ఈ అమ్మడు నడుముని మెలికలు తిప్పుతూ అందంగా డ్యాన్స్ చేసింది. నభా నటేష్ మెస్మరైజింగ్ డ్యాన్స్‌కి కుర్రకారు మైమరచిపోతున్నారు. నభా నటేష్‌పై కామెంట్ల వర్షం కురిపించకుండా ఉండలేకపోతున్నారు. ప్రస్తుతం నభా నటేష్ వీడియో వైరల్‌గా మారింది.
అవకాశాలు కనుమరుగవుతున్న తరుణంలో అందాలనే నమ్ముకొని, గ్లామర్ తో గాలం వేస్తోంది నభా నటేష్ . వరుస పరాజయాలతో వెనుకబడ్డ ఈ అమ్మడు, కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తోంది. ఒకటి రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు వార్తలు వస్తుండగా, అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ. 2018లో విడుదలైన ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. తర్వాత దర్శకుడు రఘుబాబుతో ప్రయోగాత్మక చిత్రం అదుగో చేశారు. ఆ మూవీ అట్టర్ ప్లాప్ ఖాతాలో చేరిపోగా, జనాలకు వచ్చి వెళ్లిన విషయం కూడా తెలియదు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చింది నభా నటేష్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…