Mushrooms : పుట్ట గొడుగులను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ అస్సలే ఉండదు. అందువల్ల పుట్ట గొడుగులను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. వీటిల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి కనుక అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే పుట్టగొడుగుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి.
అయితే పుట్టగొడుగులను తినడం వల్ల డిప్రెషన్‌తోపాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ మేరకు పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు 2005 నుంచి 2016 వరకు 24వేల మందికి చెందిన వివరాలను సేకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో తేలిందేమిటంటే..
పుట్టగొడుగులను తినడం వల్ల డిప్రెషన్‌ను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. దీంతోపాటు ఇతర మానసిక సమస్యలు తగ్గుతాయని, ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.
ఇక పుట్ట గొడుగులను తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ డి అందుతుంది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పలు రకాల బి విటమిన్లు అందుతాయి. అందువల్ల పుట్ట గొడుగులను తరచూ తినాలని సైంటిస్టులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…