Theatres : కరోనా పుణ్యమా అని ఓ వైపు ఓటీటీ సంస్థలు పండగ చేసుకుంటున్నాయి. గతంలో చాలా సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యాయి. దీంతో ప్రేక్షకులు ఇంటి పట్టునే ఉండి కొత్త కొత్త సినిమాలను ఓటీటీ యాప్‌లలో చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే కరోనా ప్రభావం తగ్గాక సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నప్పటికీ ప్రేక్షకులు ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. అవును.. ఈ ప్రభావం ఈ మధ్య కాలంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే..
గతంలో చిరంజీవి, మహేష్ బాబు.. వంటి అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయితే అసలు మొదటి 4 నుంచి 7 రోజుల వరకు ఏ థియేటర్ లోనూ టిక్కెట్లు లభించేవి కావు. అలాగే బుక్ మై షో లాంటి సైట్ లలో టిక్కెట్లను బుక్ చేస్తుంటే.. ఫాస్ట్ ఫిల్లింగ్ అని వచ్చేది. కానీ మొన్నీ మధ్య విడుదలైన ఆచార్యతోపాటు తాజాగా విడుదలైన సర్కారు వారి పాట మూవీకి అలాంటి పరిస్థితులు కనిపించలేదు. వాస్తవానికి ఈ రెండు సినిమాలకు తొలి రోజు అనేక థియేటర్లలో టిక్కెట్లు సులభంగానే లభించాయి. చాలా వరకు థియేటర్లలో సీట్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. బుక్ మై షో లాంటి యాప్‌లలో చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
గతంలో అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమా టిక్కెట్లను బుక్ చేస్తుంటే సీట్లు ఏవీ ఖాళీగా కనిపించేవి కావు. కానీ ఇప్పుడు తొలి రోజే సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆచార్య, సర్కారు వారి పాట ఈ రెండు సినిమాలకు పరిస్థితి ఇలాగే ఉంది. తొలి రోజు సులభంగా టిక్కెట్లు దొరుకుతున్నాయి.. అంటే.. మూవీ ఫ్లాప్ అయినా అయి ఉండాలి. లేదంటే.. థియేటర్ల పట్ల ప్రేక్షకులలో ఆసక్తి తగ్గి ఉండాలి. అయితే ఆచార్యకు ఈ రెండు అంశాలను కారణాలుగా చెప్పవచ్చు. కానీ సర్కారు వారి పాట అలా కాదు. సినిమా హిట్ టాక్‌నే సొంతం చేసుకుంది. అయినప్పటికీ థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.. అంటే థియేటర్లు అంటేనే ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిందని అర్థం చేసుకోవచ్చు. అంటే.. ప్రేక్షకులు ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది.
సినిమా విడుదలయ్యాక నెల రోజులకు.. ఇంకా చెప్పాలంటే.. 3 వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. కనుక కొద్ది రోజులు ఓపిక పడితే చాలు కదా.. ఏకంగా ఓటీటీలోనే ఇంట్లో దర్జాగా టీవీలో చూడవచ్చు.. అని చాలా మంది అనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇక థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపిస్తుండడానికి ఇంకో కారణం.. టిక్కెట్ల రేట్లు. అవును.. రెండు తెలుగు రాష్ట్రాలు సినిమాలకు మొదటి వారం పది రోజులపాటు టిక్కెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటును కల్పించాయి. దీంతో సాధారణ రోజుల్లో ఉండే ధరల కన్నా.. రిలీజ్ అయినప్పుడు టిక్కెట్ల ధరలు పన్నులతో కలిపి రెట్టింపు అవుతున్నాయి. సాధారణ థియేటర్లలో (సింగిల్ స్క్రీన్) ఒక్క టిక్కెట్ ధర రూ.200కు పైగానే వసూలు చేస్తుండగా.. మల్టీ ప్లెక్సులలో ఒక్క టిక్కెట్ ధర రూ.400కు పైగానే ఉంటోంది. అంటే సింగిల్ థియేటర్ లో నలుగురు సభ్యులు ఉన్న ఒక కుటుంబం సినిమా చూస్తే రూ.1000కి పైగానే అవుతోంది. కనుకనే మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు సినిమాకు వెళ్లాలంటే వెనుకడుగు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అయితే సినిమాకు హిట్ టాక్ రావడమో.. లేక ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రమో అయితే.. ప్రేక్షకులు టిక్కెట్లకు ఎంతైనా ధర పెట్టి సినిమాలు చూస్తున్నారు. అది ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాల విషయంలో రుజువు అయింది. కానీ సాధారణ సినిమాలకు టిక్కెట్ల రేట్లను పెంచితే వెళ్లేందుకు వారు అంతగా ఆసక్తిని చూపించడం లేదు. ఇది ఆచార్య, సర్కారు వారి పాట సినిమాల విషయంలో రుజువు అయింది. తొలి రోజు ఈ మూవీలకు థియేటర్లలో సీట్లు ఖాళీగా ఉన్నాయంటే.. పైన చెప్పిన పరిస్థితులను ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆచార్య మూవీ ఫ్లాప్ అయింది కనుక జనాలు థియేటర్లకు రాలేదు. కానీ సర్కారు వారి పాటకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. మరి తొలి రోజు ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు రాకపోయినా.. పాజిటివ్ టాక్ చూసి.. వారు రానున్న రోజుల్లో అయినా థియేటర్లకు వస్తారా.. లేక ఓటీటీలో చూద్దాంలే అనో.. టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయనో.. వెనుకడుగు వేస్తారా.. అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఇక చివరకు సర్కారు వారి పాట పరిస్థితి ఏమవుతుంది ? ఎన్ని కలెక్షన్లను సాధిస్తుంది ? అన్న వివరాలపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. దీంతో అసలు పరిస్థితి ఏమిటి ? టిక్కెట్ల రేట్లను పెంచాలా.. వద్దా.. అన్నదానిపై మళ్లీ చిత్ర పరిశ్రమ వర్గాలు పునరాలోచన చేస్తాయా.. అన్న విషయం తేలాల్సి ఉంది. అప్పటి వరకు వేచి చూడక తప్పదు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…