Samantha : సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారామె. బ్రాండ్ ప్రమోషన్స్‌లోనూ సమంత ముందుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో మాదిరిగా పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు.
సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా చిత్రం ఇటీవల విడుదలయింది. ఇక యశోద, శాకుంతలం, ఖుషి లాంటి చిత్రాల్లో సమంత నటిస్తోంది. ఇంత బిజీగా ఉండే సమంత సోషల్ మీడియాకి ఎప్పుడూ దూరం కాలేదు. జూలై 21న సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చివరగా పోస్ట్ చేసింది. మళ్లీ ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా లేదు. దీంతో అసలు సమంతకు ఏమైంది ? ఎందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది అన్న సందేహం అభిమానుల్లో కలుగుతోంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చాలా ఎక్కువగా ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. దీంతో ట్రోలర్స్, నెగెటివ్ కామెంట్స్‌కి భయపడి సామ్ ఇలా మారిపోయిందా అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సమంత వాళ్ళ అమ్మతో కలిసి నాగచైతన్యతో గడిపిన ఆ ఇంట్లోనే ఉంటోంది. అయితే ఈ మధ్య సమంత ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందట.
అర్ధరాత్రి ఇంటికి ఒక స్నేహితుడితో వచ్చిన సమంతపై ఆమె తల్లి అరిచినట్లుగా సోషల్ మీడియాలో కథలు వినిపిస్తున్నాయి. పేరుకే ఫ్రెండ్ అని చెబుతున్నా కూడా అతని ప్రవర్తన బాగా లేకపోవడంతో సమంతను తన తల్లి మందలించినట్లు సమాచారం. ఈ క్రమంలో సమంత తన తల్లిని ఇంటి నుండి బయటకు వెళ్లమనడంతో తల్లికి కోపం వచ్చి సమంత చెంప చెళ్లుమనిపించిందట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఏది ఏమైనా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండడం ఆమె ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే. వీలైనంత త్వరగా సామ్ సోషల్ మీడియాలోకి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…