Most Eligible Bachelor : అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కొన్నేళ్లుగా హిట్ కొసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. 2015లో అఖిల్ సినిమాతో హీరో అయ్యాడు అక్కినేని వారసుడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం దారుణంగా విఫలమైంది. ఆ తర్వాత రెండేళ్లకు హలో సినిమాతో పలకరించాడు. అదీ బెడిసి కొట్టింది. ఇక మూడో సినిమా మిస్టర్ మజ్ను పరిస్థితి కూడా అంతే. యావరేజ్ టాక్ వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది.
హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అఖిల్.. 15 ఏళ్లుగా హిట్ లేని బొమ్మరిల్లు భాస్కర్‌తో కలసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రాన్ని చేశాడు. అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. అఖిల్ కెరీర్‌లో మొదటి రూ.50 కోట్ల సినిమా ఇదే కావడం విశేషం.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులతోపాటు యువతకు కూడా ఎంతో బాగా నచ్చింది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కెమిస్ట్రీకి తోడు గోపీ సుందర్ మ్యూజిక్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్, వాసు వర్మ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని నిర్మించారు.
వినోదంతోపాటు చక్కటి సందేశం కూడా ఈ సినిమాలో ఉందని దర్శక నిర్మాతలు చెప్పిన మాట నూటికి నూరుపాళ్ళు నిజమైంది. గోపీ సుందర్ మ్యూజిక్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. ముఖ్యంగా లెహరాయి పాట యూట్యూబ్ లో 25 మిలియన్ వ్యూస్ ను అందుకుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…