Monkeys : ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ అనే ప్రాంతంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ పసికందును కోతులు తస్కరించి వాటర్ ట్యాంకులో పడేశాయి. దీంతో నీటిలో మునిగిన ఆ చిన్నారి చనిపోయాడు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి.. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ అనే ప్రాంతంలో కేశవ కుమార్ అనే 2 నెలల పసికందును తన బామ్మ మంచంలో పడుకోబెట్టుకుంది. వారు భవనం పైన టెర్రస్ మీద ఉన్న అంతస్థులో ఓ గదిలో నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఆ వృద్ధురాలు గది తలుపులు పెట్టలేదు.
ఈ క్రమంలోనే కొన్ని కోతులు అటుగా వచ్చాయి. నిద్రిస్తున్న పసికందును తన బామ్మ నుంచి లాక్కుని అక్కడే పక్కన ఉన్న వాటర్ ట్యాంకులో పడేశాయి. అయితే ఆ వృద్ధురాలికి మెళకువ వచ్చి చూడా.. పక్కనే నిద్రిస్తూ ఉండాల్సిన తన మనవడు కనిపించలేదు. దీంతో ఆమె అందరికీ విషయం చెప్పింది. వారందరూ చుట్టూ అంతటా గాలించారు. చివరకు ఆ పసికందు మృతదేహం వాటర్ ట్యాంకులో కనిపించింది. దీంతో ఆ కుటుంబం పడుతున్న వేదన అంతా ఇంతా కాదు.
అయితే ఈ విషయంపై చండీనగర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఓపీ సింగ్ మాట్లాడుతూ.. వాస్తవానికి ఆ ఏరియాలో కోతుల బెడద ఎక్కువగా ఉందని ప్రజల నుంచి అనేక మార్లు ఫిర్యాదులు వచ్చాయని.. ఈ విషయాన్ని తాము స్థానిక అటవీశాఖ అధికారులకు ఇప్పటికే తెలియజేశామని.. అయినప్పటికీ వారు చర్యలు తీసుకోలేదని తెలిపారు. లేదంటే ఈ ఘాతుకం జరిగి ఉండేది కాదన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…