Mohan Babu : కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణగా పేరు తెచ్చుకున్న మోహన్‌బాబు ఎప్పుడూ కోపంగా కనిపిస్తుంటారు. ఆయన చీటికీ మాటికీ ఎవరిని పడితే వాళ్లను ఎంత మాట అంటే అంత మాట అనేస్తారని టాక్ ఉంది. అందుకనే ఆయన లేదా ఆయన కుమారుల సినిమాల్లో నటించేందుకు నటీనటులు ఆసక్తిని చూపించరట. అయితే వాస్తవానికి మోహన్ బాబు ముక్కు సూటిగా మాట్లాడతారు. ఆయన ఉన్నది ఉన్నట్లు ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేస్తారు. కనుకనే ఆయనపై అలాంటి ముద్ర పడిపోయిందని తెలుస్తోంది. అయితే మోహన్ బాబు అప్పట్లో ఓ హీరోయిన్‌ను షూటింగ్ స్పాట్‌లోనే చెంప చెళ్లుమనిపించారు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయం చాలా మందికి తెలియదు.
మోహన్‌బాబు అప్పట్లో ఓ హీరోయిన్‌ను షూటింగ్ స్పాట్‌లోనే చెంప దెబ్బ కొట్టారన్న వార్త బాగా ప్రచారం అయింది. దీంతో ఆయనను అందరూ నిందించారు. మోహన్‌బాబుకు చాలా అహంకారమని.. అందుకనే ఆ హీరోయిన్ పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటారని అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. అప్పట్లో మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా తొలి సినిమా విష్ణు తీశారు. దీన్ని మోహన్ బాబు స్వయంగా తమ బ్యానర్ అయిన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. దీనికి మళయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. ఇస్మాయిల్ దర్బార్ సంగీతం అందించారు. ఇందులో విష్ణుకు జోడీగా అప్పటి హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా శివానంద్ నటించింది. విష్ణు సినిమా ఈమెకు కూడా మొదటి సినిమానే కావడం విశేషం.
అయితే శిల్పా శివానంద్ షూటింగ్‌కు టైముకు రాకపోయేదట. ఆమెకు ఎన్నో సార్లు చెప్పినా ఆమె పెడచెవిన పెట్టిందట. దీంతోపాటు దర్శకుడు చెప్పింది చేసేందుకు కొన్నిసార్లు అసలు ఒప్పుకోకపోయేదట. దీంతో ఎంత చెప్పినా విననందుకు గాను మోహన్ బాబు ఆమెను చెంప దెబ్బ కొట్టారట. దీంతో ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ దీని వల్ల మోహన్‌బాబుపై బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ వార్త అప్పట్లో బాగా ప్రచారం అయింది. దీంతో మోహన్‌బాబు కోపిష్టి అన్న ముద్ర పడిపోయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…