Mohan Babu : ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతుండడంతో ‘మా’ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అక్టోబర్ 10వ తేదీన పోలింగ్.. అదే తేదీన ఫలితాలు విడుదల కానుండడంతో అప్పుడు ఎవరు మా అధ్యక్షుడిగా గెలుస్తారా ? అని.. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే మా ఎన్నికల నేపథ్యంలో మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌లో ప్రసారం అయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే లో పాల్గొన్న మోహన్ బాబు మా ఎన్నికలపై షాకింగ్ కామెంట్లు చేశారు. నీచ, నికృష్ణ, దరిద్రగొట్టు, భ్రష్టు రాజకీయాలు మా ఎన్నికలలో నెలకొన్నాయని అన్నారు. తెలిసినవాడు, తెలియనివాడు, వెధవలు, క్యారెక్టర్స్ లేనివాళ్లు కొంతమంది అదేదో కిరీటం అనుకుని, అద్భుతం అనుకుని ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు.
నిజానికి తన కుమారుడు మంచు విష్ణును మా ఎన్నికల్లో పోటీ చేయించాలని తాము అనుకోలేదని, అయితే కొన్ని ప్రత్యేక కారణాలు ఉండడం వల్లే మంచు విష్ణుతో పోటీ చేయించాల్సి వస్తుందన్నారు. ఇక ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎవరికి వారు మాకెందుకులే అన్న ధోరణిలో ఉన్నారని అన్నారు. ఇది సరికాదన్నారు.
ఇండస్ట్రీలో కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మోహన్ బాబు అన్నారు. గజరాజు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని విమర్శించారు. ప్రతి దానికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు. చిరంజీవి తనకు ఎప్పటికీ స్నేహితుడేనని, మా ఎన్నికల్లో మంచు విష్ణు నిలబడకపోయి ఉంటే ఆయన దగ్గరకు వెళ్లే వాడినని అన్నారు. మంచు విష్ణు నామినేషన్ వేశాక మెగా ఫ్యామిలీ పిలిచి మాట్లాడి ఉంటే తాము నామినేషన్‌ను ఉపసంహరించుకునే వాళ్లమని తెలిపారు. ఇక చిరంజీవి దగ్గరికి వెళ్లకపోయినా.. కృష్ణ ఆశీస్సులు తీసుకున్నామన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…