Allu Arjun : మెగా కుటుంబంలో అల్లు అర్జున్ రూటే వేరు. ఆయన సినిమాలే కాదు.. వ్యాఖ్యలు కూడా భిన్నంగా ఉంటాయి. తాను ఇతర హీరోలకు చెందిన సినిమా వేడుకలకు వెళ్లినా.. లేదా తన సొంత సినిమా వేడుక అయినా సరే.. మెగా కుటుంబం గురించి పెద్దగా మాట్లాడరు. అందుకనే మెగా ఫ్యాన్స్ తరచూ ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పేరును చెప్పాలని పదే పదే అరుస్తుంటారు. అయితే ఓ సందర్భంలో ఇలాగే అరిస్తే అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు కూడా. అయితే అల్లు అర్జున్‌కు, మెగా ఫ్యామిలీకి మధ్య ఇటీవలి కాలంలో దూరం పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. అందుకు బలం చేకూర్చేలా తాజాగా ఓ కార్యక్రమాన్ని కూడా ఫ్యాన్స్ నిర్వహించారు. అందులో అల్లు అర్జున్ ప్రస్తావనే రాలేదు.
ఇటీవల ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో మెగా ఫ్యాన్స్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో పవన్ కల్యాణ్ భవిష్యత్ ప్రణాళికపై వారు చర్చించారు. ఈసారి పవన్‌ను ఎలాగైనా సరే సీఎంను చేయాలని కంకణం కట్టుకోవాలని.. జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని.. వారు తీర్మానం చేశారు. అయితే ఆ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఒక ఫొటో దర్శనమిచ్చింది. అందులో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఉన్నారు కానీ.. అల్లు అర్జున్ లేడు. దీంతో అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ దూరం పెట్టేశారా ? అన్న వార్తలకు బలం చేకూరినట్లు అయింది. గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. కానీ దీనిపై అటు అల్లు అర్జున్ కానీ.. ఇటు మెగా ఫ్యాన్స్ కానీ స్పందించలేదు. అయితే ఇప్పుడు ఈ ఫొటో చూస్తే ఈ విషయం నిజమేనని అర్థమవుతోంది.
అయితే ఇది పూర్తిగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన మీటింగ్. ఇందులో చిరంజీవికి సంబంధం లేదు. కానీ రాజకీయాలు అంటే ఇష్టం లేని చిరంజీవిని ఇందులో ఇన్వాల్వ్ ఎందుకు చేశారని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. వాస్తవానికి చిరంజీవి ఏపీలో జగన్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. కానీ పవన్ మాత్రం జనసేనపార్టీ తరఫున వైరం పెట్టుకుంటున్నారు. అలాంటప్పుడు పవన్ పొలిటికల్ కెరీర్ కోసం చిరంజీవి ఫొటోను వాడుకోవాల్సిన అవసరం ఏముంది ? అన్న ప్రశ్న వస్తోంది. అయితే దీనిపై చిరంజీవి ఏమైనా స్పందిస్తారో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…