Meenakshi Seshadri : సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను కొనసాగిస్తారు. కానీ హీరోయిన్లు అలా కాదు. కొన్నేళ్ల పాటు మాత్రమే వారి కెరీర్ ఉంటుంది. తరువాత పెళ్లి చేసుకుని స్థిర పడుతుంటారు. అయితే ఇలాంటి వారిలో కొందరు పెళ్లి అనంతరం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుంటారు. కానీ కొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో మీనాక్షి శేషాద్రి ఒకరు. ఈమె అప్పట్లో టాప్ హీరోయిన్‌గా ఉండేది. కానీ వివాహం అనంతరం ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఈమె వివాహం చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయింది.
మీనాక్షి శేషాద్రి పేరు చెప్పగానే ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆపద్బాంధవుడు సినిమానే మనకు గుర్తుకు వస్తుంది. అయితే ఈమె ఇదే కాదు.. ఇంకా అనేక చిత్రాల్లో నటించింది. ఈమె అసలు పేరు శశికళ శేషాద్రి. జార్ఖండ్ రాష్ట్రంలోని సింధి అనే ప్రాంతంలో జన్మించింది. వీరి కుటుంబం మొత్తం తమిళ నేపథ్యం ఉన్నవారే. ఇక మీనాక్షి శేషాద్రి మంచి నృత్యకారిణి. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ లాంటి నృత్యాల్లో ఈమెకు ప్రావీణ్యత ఉంది. అప్పట్లో ఆమె మిస్ ఇండియాగా కూడా ఎంపికైంది.
మీనాక్షి శేషాద్రి అప్పట్లో టాప్ మోడల్‌గా కూడా ఉంది. ఈమె అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, సన్నీ డియోల్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే ఎన్‌టీఆర్, బాలయ్య కలసి నటించిన విశ్వామిత్ర అనే మూవీలో మేనక పాత్రను పోషించింది. 1980-90లలో ఈమె భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే ఆమెకు ఇప్పుడు 57 ఏళ్లకు పైగానే ఉంటాయి. దీంతో ముఖంలో వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఈమెను సులభంగానే గుర్తు పట్టవచ్చు. ఇక ఈమె ప్రస్తుతం అమెరికాలో సెటిల్ కాగా.. అక్కడే చాలా మందికి నాట్యం నేర్పిస్తోంది. కానీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…