SS Thaman : టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎస్ఎస్ థమన్ ఒకరు. అతనిపై ఎన్ని విమర్శలు వస్తున్నాయో, అంతకన్నా ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు పొందుతున్నాడు. వరుస బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్నాడు. గత రెండేళ్లుగా మంచి హిట్స్ తో దూసుకెళుతున్న థమన్ ప్రస్తుతం డజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నారు. నేడు (నవంబర్ 16) థమన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా థమన్‌తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు. గనిటీం, ఎన్‌బీకే 107 టీం, ఎస్ఎస్ఎమ్‌బీ 28 చిత్రాలతోపాటు పలువురు ప్రముఖులు అతనికి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే థమన్ బర్త్ డే సందర్భంగా ఆయన బర్త్ డే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేయడమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు.
తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన థమన్.. తన కెరీర్ లో ఒప్పుకున్న తర్వాత తన చేతి నుంచి వెళ్లిపోయిన సినిమా ‘టక్ జగదీష్’ అని థమన్ అన్నారు. ”ఆ సినిమాకి నేను చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ నాని గారికి నచ్చలేదు. మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించుకున్నారు. దానికి కొంచెం బాధ పడ్డాను. ఇలా నా లైఫ్ లో ఫస్ట్ టైం జరిగింది. ఎక్కడ తప్పు జరిగిందో నాకు తెలియదు” అని థమన్ చెప్పారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…