Manchu Vishnu : అసెంబ్లీ ఎన్నికల కన్నా దారుణంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మంచు విష్ణు ప్యానెల్, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మధ్య ఏ రేంజ్‌లో మాటల దాడి జరిగిందో మనందరం చూశా. ఎన్నికల తర్వాత కూడా ఇదే జరిగింది. అయితే ‘మా’ నూతన అధ్యక్షుడిగా శనివారం మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు ప్రకటించిన మా మేనిఫెస్టోలో ప్రస్తావించిన ప్రతీ అంశం అమలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
‘మా’ అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా పని చేద్దామని ‘మా’ కార్యవర్గానికి ఆయన పిలుపునిచ్చారు. అయితే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేయడం పట్ల మంచు విష్ణు ఆందోళన చెందారు. ‘‘మా’ ఎన్నికల్లో మేము గెలిచాం. పత్యర్థి ప్యానల్ వాళ్లు దీన్ని గౌరవించాలి. ఎన్నిక ఫలితాల అనంతరం ప్రత్యర్థి ప్యానల్ వాళ్లు రాజీనామాలు చేశారు. వారి కారణాలు వారికి ఉండొచ్చు. అది చాలా దురదృష్టకరం.
మా’ అసోసియేషన్ అభివద్ధికి కోసం ఏ కార్యక్రమాలను చేపట్టినా వారి సలహా తీసుకుంటాను. వారి సపోర్టు నాకు ఉంటుందని ఆశిస్తున్నా’’ అంటూ మంచు విష్ణు స్పష్టం చేశారు. ఇక నుండి ‘మా’ ఎన్నికలపై మీడియాలో మాట్లాడమని, కేవలం తాము చేయబోయే కార్యక్రమాల గురించే మాట్లాడతామంటూ.. విష్ణు వ్యాఖ్యానించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…