Manchu Vishnu : మా ఎన్నికల ఫలితాలపై మంచు విష్ణు కీలకవ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన ప్యానెల్ సభ్యులతో కలిసి మాట్లాడారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో తనను విత్ డ్రా చేసుకోమని చిరంజీవి చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం చెప్పకూడదనుకున్నానని, అయితే ఎన్నికలు ముగిశాయి కాబట్టి చెబుతున్నానని అన్నారు.
రామ్‌చరణ్ తనకు మంచి స్నేహితుడని, తండ్రి చిరంజీవి మాటకు కట్టుబడి ప్రకాశ్‌రాజ్‌కే ఓటేసి ఉంటారని అన్నారు. రామ్‌చరణ్ స్థానంలో తాను ఉన్నా అదే చేస్తానని చెప్పారు. తన గెలుపుకు వంద శాతం తన తండ్రి మోహన్ బాబే కారణమని తెలిపారు. అలాగే నరేష్ కూడా తన గెలుపుకు ఎంతో కష్టపడ్డారని అన్నారు.
మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలని, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉన్న నటులు కూడా వచ్చి తనకు ఓటు వేసి తనను ఆశీర్వదించారని అన్నారు. ఇక ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో గెలిచిన వారిని కూడా తమతో కలుపుకొని పోతామని, తామంతా ఒక్కటేనని తెలిపారు. అయితే ప్రకాష్ రాజ్, నాగబాబుల రాజీనామాలను ఆమోదించబోనని, వారితో కలసి మాట్లాడుతానని, వారి సలహాలతో ముందుకు సాగుతానని మంచు విష్ణు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…