Manchu Lakshmi : మంచు లక్ష్మి గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతో కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉన్న ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. ఇక ఈమె కేరళ సాంప్రదాయ పోరాట విద్య కలరి నేర్చుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. నిత్యం ఈ కలరి విద్యకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా మంచు లక్ష్మి ఈ విద్యకు సంబంధించిన మరొక ఫోటోని షేర్ చేస్తూ తన గురువు గురించి గొప్పగా చెప్పడమే కాకుండా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది.

గజ వటివు అనే ఆసనం వేసిన ఫోటోని షేర్ చేస్తూ ఆ ఆసనం గురించి చెప్పుకొచ్చింది. ఈ ఆసనం వేయడం వల్ల మనలో కోపం తగ్గడమే కాకుండా ఎంతో చురుకుదనం ఉంటుందని, మనలో శక్తిని రెట్టింపు చేసి నియంత్రణ సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపింది. అలాగే మన పాదాలపై బరువు ఉండటం వల్ల మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది కూడా తెలుస్తుందని ఈమె చెప్పుకొచ్చింది. ఇలా ఎంతో అద్భుతమైన విద్యను నేర్చుకోవడం ఎంతో గొప్పగా ఉందని లక్ష్మీ మంచు వెల్లడించింది.
ఇలాంటి విలువైన విద్య నేర్చుకోవడానికి కారణం మా గురువుగారు కృష్ణదాస్ వల్లభట్ట కారణమని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక ఆయనకు తాజాగా పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందని ఈ సందర్భంగా మంచు లక్ష్మి వెల్లడించింది. ప్రస్తుతం మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మోహన్ లాల్ తో కలిసి మాన్ స్టర్ అనే మలయాళ చిత్రంలో నటించింది. అలాగే పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తోంది.