Huge Lock : అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ మందిర నిర్మాణం కొనసాగుతున్న విషయం విదితమే. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది భక్తులు ఇచ్చిన విరాళాలతో సర్వాంగ సుందరంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మందిరం కోసం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ భక్తుడు ఏకంగా 400 కిలోల బరువు ఉండే తాళాన్ని రూపొందించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాష్ శర్మ (65) తాళాల వ్యాపారం చేస్తుంటాడు. అడిగిన వారికి తాళాలను తయారు చేసి ఇస్తుంటాడు. వారికి ఈ వృత్తి తరతరాల నుంచి వస్తోంది. తాను కూడా ఇదే వృత్తిలో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అయోధ్యలో నిర్మాణమవుతున్న రామమందిరం కోసం సత్యప్రకాష్ శర్మ తన భార్య రుక్మని శర్మతో కలిసి 400 కిలోల బరువు ఉండే భారీ తాళాన్ని తయారు చేశాడు.
ఇక ఆ తాళాన్ని తెరిచేందుకు అవసరం అయిన తాళం చెవిని ఏకంగా 30 కిలోల బరువుతో తయారు చేశాడు. ఈ క్రమంలోనే తాళం మీద శ్రీరాముడి బొమ్మ వచ్చేలా తయారు చేశాడు. అందుకు గాను అతనికి రూ.2 లక్షల వరకు ఖర్చు అయింది.
ఇక తాళం, చెవి తుప్పు పట్టకుండా ఉండేందుకు గాను స్టీల్‌తోపాటు ఇత్తడిని కూడా ఉపయోగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాళాన్ని పూర్తి స్థాయిలో తయారు చేసేందుకు మరికొంత కాలం సమయం పడుతుందని, అయితే తన వద్ద ప్రస్తుతం డబ్బు లేదని, ఎవరైనా దాతలు విరాళంగా ఇస్తే తాళం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి రామ మందిరానికి ఇస్తానని చెబుతున్నాడు.
ఇక సత్యప్రకాష్ శర్మ గతేడాది కూడా 300 కిలోల బరువు ఉండే ఓ తాళాన్ని తయారు చేసి అబ్బురపరిచాడు. త్వరలో రిపబ్లిక్ డే వేడుకల్లో పరేడ్‌లో తన తాళం నమూనాలను ప్రదర్శించాలని చూస్తున్నాడు. అలాగే భారీ తాళాలను తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కాలని కూడా అతను కోరుకుంటున్నాడు. అతని కలలు సాకారం కావాలని కోరుకుందాం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…