Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చి అందరి ప్రశంసలు అందుకుంటూ స్టార్ హీరోగా మారాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరోనే. ఎన్నో దాతృత్వ కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడని ఈ స్టార్ హీరో చేసే మంచి పనుల గురించి అందరికీ తెలిసిందే. గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు మహేష్ ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇక తాజాగా మహేష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
మహేష్ బాబు ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్ కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు వెయ్యికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా జరిగే సేవా కార్యక్రమాల గురించి నమ్రత ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. ఏప్రిల్ 7న నమ్రత ఓ పోస్ట్ చేశారు. అందులో 30 మంది చిన్నారులకు ఒకే రోజు ఆపరేషన్ చేసినట్టుగా తెలిపారు. అంటే ఒకే రోజు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా 30 మంది చిన్నారులకు ఊపిరి అందిందన్నమాట. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్, మహేష్ బాబు ఫౌండేషన్ వైద్యుల సహకారంతో చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయించారు.
మంచి పనికి సపోర్ట్ ను అందించినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు ధన్యవాదాలు తెలిపారు నమ్రత. ఒకవైపు చిన్నారుల జీవితాలలో వెలుగు నింపుతున్న మహేష్ మరో వైపు తన సొంతూరు బుర్రిపాలెంలోనూ డిజిటల్ లెర్నింగ్‌ను మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ప్రారంభించారు. ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మహేష్ చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…