Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడికి ఆయన పునర్జన్మ ఇచ్చారు. శ్రీమంతుడు సినిమాలో ఆయన ఓ గ్రామాన్నే దత్తత తీసుకుని సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు. ఇక రియల్ లైఫ్‌లోనూ ఆయన ఇలాగే హీరో అనిపించుకుంటున్నారు. చిన్నారుల గుండె ఆపరేషన్లకు అయ్యే ఖర్చును ఆయన తన ఫౌండేషన్ ద్వారా భరిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన తన ఫౌండేషన్ ద్వారా తాజాగా ఓ బాలుడి శస్త్ర చికిత్సకు అయ్యే సహాయం చేశారు. దీంతో బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్‌లు తమ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లను చేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరికి రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కూడా సహకారం అందిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఓ 14 నెలల బాలుడికి గుండెకు శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. మరోవైపు బాలుడు ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీంతో వెంటనే స్పందించిన మహేష్ బాబు ఫౌండేషన్ ఆ బాలుడి శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో రెయిన్‌బో హాస్పిటల్ వైద్యులు ఆ బాలుడికి ఆపరేషన్ చేశారు. అది విజయవంతం అయింది. ఆ బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. క్షేమంగా చికిత్స పొందుతున్నాడు. ఇదంతా మహేష్ చలవే అని ఆయనను కొనియాడుతున్నారు.
ఇక మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా పేద చిన్నారికి ఇలా సహాయం అందించడంతో అందరూ ఆయనను అభినందిస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. తమ అభిమాన హీరో చేస్తున్న పనులకు వారు పొంగిపోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేష్ నటించిన సర్కారు వారి పాట ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఆయన తన నెక్ట్స్ సినిమాను త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ఇందులో పూజా హెగ్డె హీరోయిన్ గా ఎంపికైంది. ఈ మూవీ తరువాత వచ్చే ఏడాది నుంచి రాజమౌళితో సినిమా ప్రారంభం అవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…