Samantha : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంతపై భారీగా నెగెటివిటీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టినా వెంటనే ట్రోల్స్, విమర్శలు పెరిగిపోతున్నాయి. ఆమె గ్లామరస్ దుస్తులను ధరించి పోస్ట్‌లు పెడితే చాలు.. వెంటనే ట్రోల్స్ వచ్చేస్తున్నాయి. అప్పట్లో ఈమెను బాగా విమర్శించేవారు. కానీ ఇప్పుడు కాస్త తగ్గాయి. అయితే తాజాగా ఈమె మళ్లీ అనవసరంగా వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే ఆమెను మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆమెను భారీ ఎత్తున విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం.. లైగర్. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి విజయ్ దేవరకొండ పోస్టర్ ఒకదాన్ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. అందులో విజయ్ దేవరకొండ షాకింగ్ లుక్‌లో కనిపించాడు. పూర్తిగా నగ్నంగా కనిపించాడు. కింది భాగం వద్ద కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ ఫొటోపై అనేక మంది హీరోయిన్లు కామెంట్లు చేయగా.. సమంత కూడా కామెంట్ పెట్టింది.
విజయ్‌కి రూల్స్ తెలుసు.. కనుక అతను వాటిని సులభంగా బ్రేక్ చేయగలడు.. గట్స్ ఉన్నవాడు.. అంటూ సమంత పోస్ట్ పెట్టింది. అయితే దీన్ని అదునుగా చేసుకుని మహేష్ బాబు ఫ్యాన్స్‌ను ఆమె ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది. గతంలో మహేష్ సుకుమార్ దర్శకత్వంలో చేసిన 1, నేనొక్కడినే సినిమా ఫ్లాప్ అయిన విషయం విదితమే. అయితే ఇందులో మహేష్‌కు జోడీగా కృతి సనన్ నటించింది. ఒక సీన్‌లో ఆమె మహేష్ వెనుక కుక్క పిల్లలా ఆయన అడుగులను ఫాలో అవుతుంటుంది. అయితే దీనిపై అప్పట్లో సమంత పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది అత్యంత నీచమైంది.. అన్నట్లుగా ఆమె కామెంట్ చేసింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సమంతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నువ్వు స్కిన్ షో చేస్తే ఏమీ లేదు కానీ.. సినిమాలో అలాంటి సీన్ పెడితే తప్పైందా.. అంటూ సమంతను అప్పట్లో నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. అయితే ఇప్పుడు విజయ్ పూర్తి నగ్నంగా ఉన్న లుక్ పై సమంత డీసెంట్‌గా ఉన్నాడు అన్నట్లుగా కామెంట్ పెట్టింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ మళ్లీ ఆమె పాత పోస్టును పైకి తెచ్చి ఫైర్ అవుతున్నారు. అప్పుడు ఆ సీన్‌నే నీచమైంది అన్నావు.. ఇప్పుడు నగ్నంగా ఉంటే డీసెంట్ ఎలా అవుతుంది.. అంటూ సమంతను ప్రశ్నిస్తూ వారు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు వ్యతిరేకంగా వారు భారీ ఎత్తున పోస్ట్‌లు పెడుతూ విమర్శిస్తున్నారు. అయితే దీనికి సమంత రిప్లై ఇస్తుందేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…