Mahesh Babu : శీతల పానీయాల యాడ్స్ ఏమోగానీ హీరోలు పోటీ పడి మరీ యాడ్స్ చేస్తున్నారు. ఇటీవలే రౌడీ హీరో విజయ్ దేవరకొండ థమ్స్ అప్ యాడ్ ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు మౌంటెయిన్ డ్యూ యాడ్‌తో ముందుకు వచ్చారు. గతంలో మహేష్ థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేవారు. కానీ ఇటీవలే ఆయనతో థమ్స్ అప్ తెగతెంపులు చేసుకుంది. కారణం.. 3 ఏళ్ల కాలానికి గాను మహేష్ అత్యధిక రెమ్యునరేషన్ ను అడగడమే అని చెప్పవచ్చు.
థమ్స్ అప్ యాడ్‌లలో నటించేందుకు గాను గతంలో ఆ సంస్థ మహేష్‌కు 3 ఏళ్ల కాలానికి గాను ఏకంగా రూ.8 కోట్లను ఇచ్చిందట. అయితే ఇటీవలే ఆ కాంట్రాక్టు గడువు ముగిసింది. ఈ క్రమంలో మహేష్ రూ.10 కోట్లు అడిగారట. కానీ థమ్స్ అప్ అంత మొత్తం ఇవ్వలేమని చెప్పింది. దీంతో ఆ సంస్థతో మహేష్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. తరువాత మౌంటెయిన్ డ్యూ సంస్థ మహేష్‌తో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ఆయన అడిగినంత మొత్తం ఇచ్చింది. దీంతో 3 ఏళ్ల కాలానికి గాను మహేష్ కు మౌంటెయిన్ డ్యూ రూ.10 కోట్ల భారీ మొత్తం ఇవ్వనుందని సమాచారం.
ఇక విజయ్ దేవరకొండకు థమ్స్ అప్ అదే 3 ఏళ్ల కాలానికి కాంట్రాక్టు ఇచ్చింది. ఈ క్రమంలోనే విజయ్‌కు 3 ఏళ్లకు ఆ సంస్థ రూ.2.50 కోట్లను ఇవ్వనుంది. ఇలా థమ్స్ అప్ తన ఖర్చును తగ్గించుకుంది. తమకు విజయ్ దేవరకొండ చాలు అని సరిపెట్టుకుంది. కానీ మౌంటెయిన్ డ్యూ మాత్రం కచ్చితంగా మహేష్ లాంటి పెద్ద స్టార్ కావాలని నిర్ణయించుకుంది. అందుకనే రూ.10 కోట్లను కూడా మహేష్ కు ఇచ్చేసింది. మరి రెండు యాడ్‌లలో ఎవరి యాడ్ ఎక్కువ పాపులర్ అవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…