Mahaan Movie : ఇటీవల ఒక నెల రోజుల కిందటి వరకు అంతా బాగానే ఉంది. కరోనా కేసులు తగ్గాయి, ఇక థియేటర్లకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని అందరూ భావించారు. అనేక సినిమాలు థియేటర్లలోనే విడుదలయ్యాయి. కానీ నెల తిరిగే సరికి పరిస్థితి అంతా తారుమారైంది. కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో నిర్మాతలు మళ్లీ థియేటర్లను వదిలి ఓటీటీల బాట పడుతున్నారు. ఇక తాజాగా తమిళ నటుడు విక్రమ్ కూడా ఓటీటీలోనే తన సినిమాను విడుదల చేయబోతున్నారు.
విక్రమ్ నటించిన మహాన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేసింది. ఈ మూవీని ఫిబ్రవరి 10వ తేదీన అమెజాన్‌లో రిలీజ్ చేయనున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఈ చిత్ర విడుదలపై అనేక వార్తలు వచ్చాయి. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది.
ఇక ఈ మూవీలో విక్రమ్‌తోపాటు ఆయన తనయుడు ధ్రువ్ కూడా కీలక పాత్రలో నటించాడు. అర్జున్ రెడ్డి రీమేక్‌తో ధ్రువ్ హీరోగా పరిచయం అయ్యాడు. రెండో సినిమాకే తన తండ్రితో కలిసి చేయడం విశేషం. పిజ్జా, జిగర్ తండా సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మహాన్‌కు దర్శకత్వం వహించారు. కార్తీక్ చివరి సినిమా జగమే తంత్రం ఓటీటీలోనే నేరుగా రిలీజైంది.
గతలో కార్తీక్ అద్భుతమైన సినిమాలు తీసినా.. పేట నుంచి ఫ్లాప్ అవుతున్నాడు. అయితే మహాన్‌తో అయినా అదృష్టం మళ్లీ వరిస్తుందో, లేదో చూడాలి. ఈ మూవీలో బాబీ సింహా, సిమ్రాన్‌లు కీలక పాత్రల్లో నటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…