Liquor Sales : తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. గతేడాది కోవిడ్ ఆంక్షల కారణంగా లిక్కర్ సేల్స్ కొంత వరకు తగ్గాయి. అయితే ఈ ఏడాది మాత్రం పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో మద్యం అమ్మకాలు భారీగానే జరిగాయి. ఈ క్రమంలో గత 5 రోజుల్లో ఏకంగా రూ.902 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగడం విశేషం.
డిసెంబర్‌లో తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా రూ.3,435 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది డిసెంబర్‌లో రూ.2764 కోట్ల మద్యం అమ్ముడవగా.. ఈసారి అంతకన్నా ఎక్కువగానే మద్యం అమ్మకాలు జరగడం విశేషం.
ఇక డిసెంబర్ 27న రాష్ట్ర వ్యాప్తంగా రూ.202.42 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, 28వ తేదీన రూ.155.48 కోట్లు, 29న రూ.149.53 కోట్లు, 30న రూ.246.56 కోట్లు, 31వ తేదీ రాత్రి 7 గంటల వరకు రూ.148.52 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం అర్థరాత్రి 1 గంట వరకు వైన్ షాపులు, బార్లను తెరిచేందుకు అనుమతులు ఇవ్వడంతో ఈ సేల్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
కాగా రాష్ట్రంలో గతేడాది రూ.25,601.39 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా ఈ ఏడాది శుక్రవారం సాయంత్రం వరకు రూ.30,196 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కలు ఇంకా పెరగనున్నాయి. ఈసారి మొత్తం 3,68,68,975 కేసుల మద్యం అమ్ముడవగా, 3,25,82,859 కేసుల బీర్ అమ్ముడైంది. కేవలం రంగారెడ్డి జిల్లాలోనే మద్యం అమ్మకాల ద్వారా రూ.6,979 కోట్ల ఆదాయం రాగా, రూ.3,288 కోట్లతో నల్గొండ రెండో స్థానంలో నిలిచింది. తరువాత రూ.3,201 కోట్లతో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…