Liger : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం లైగర్ చిత్రంతో ఎంతో బిజీగా ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా చిత్రబృందం మొత్తం అమెరికాలోని లాస్ వెగాస్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా కొన్ని ఫోటోలను అనన్య పాండే సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసింది.
తాజాగా ఆమె హీరో విజయ్ దేవరకొండతో కలిసి హార్స్ రైడింగ్ వెళ్లింది. ఈ క్రమంలోనే గుర్రంపై కూర్చుని ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ “హౌడీ రౌడీ” అని రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న లైగర్ చిత్రంలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ నటిస్తున్నారు. గత మూడు రోజుల క్రితం మైక్ టైసన్ తో కలిసి దిగిన ఫోటోలని అనన్య పాండే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ప్రస్తుతం ఈమె గుర్రపుస్వారీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, నటి ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుందని చిత్ర బృందం వెల్లడించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…