Liger Movie : రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నువ్విలా’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. నేచురల్ స్టార్ నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించి మెప్పించాడు. ఈ సినిమాతో విజయ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. లుక్స్ పరంగానే కాకుండా నటనతోనూ ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. ఇక అర్జున్ రెడ్డితో ఫుల్ క్రేజ్ తెచ్చుకొని ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్నాడు.
విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఛార్మి, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు.
వరుస అప్‌డేట్స్ తో లైగర్ టీమ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. తాజాగా లైగర్ నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు. చాయ్ వాలా టు బాక్సర్.. ముంబైలో చాయ్ వాలాగా జీవనం సాగించే వ్యక్తి ఎలా బాక్సర్ గా ఎదిగాడన్నది చూపించారు.
విజయ్ దేవరకొండ మేకోవర్ అందిరిపోయింది. లైగర్ సినిమాలో మైక్ టైసన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. సినిమా కథను ఆయన పాత్రే మలుపు తిప్పుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…