Lavanya Tripathi : తమిళనాడులో ఇటీవల లావణ్య అనే యువతి ఆత్మహత్య సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనను ఓ మతం నుంచి ఇంకో మతానికి బలవంతంగా మార్పిడి చేస్తున్నారని చెబుతూ.. తాను తీవ్ర ఒత్తిడికి గురయ్యానని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి మరీ ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ సంఘటనలోకి నటి లావణ్య త్రిపాఠిని లాగారు. ఓ నెటిజన్ అయితే ఆమె పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో లావణ్య త్రిపాఠి స్పందించింది. తనదైన శైలిలో ఆ నెటిజన్‌కు కౌంటర్ ఇచ్చింది.
#LavanyaTripathi అనే హ్యాష్‌ట్యాగ్‌ను దయచేసి వాడకండి, ఆమె ఒక చీప్ నటి, అక్కడ చనిపోయింది లావణ్య, ఆమె ఒక దళిత అమ్మాయి, ఆమె ధర్మం కోసం పోరాడింది, లావణ్య త్రిపాఠి లాంటి చీప్ నటులను లావణ్య లాంటి అమ్మాయిలతో పోల్చకండి.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దీంతో లావణ్య త్రిపాఠి స్పందించింది.
మీ లాంటి మగవారు మహిళలకు గౌరవం ఇవ్వడం ఎప్పుడు నేర్చుకుంటారు, అక్కడ జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన, ఒకర్ని చీప్ అని నిందించే బదులు వారిని గౌరవించడం ఎలాగో నేర్చుకోండి, జరిగిన సంఘటనకు నేను చాలా చింతిస్తున్నా, మన సమాజం ప్రస్తుతం అలాగే ఉంది.. అని లావణ్య త్రిపాఠి ట్వీట్ చేసింది.
తమిళనాడులో లావణ్య అనే అమ్మాయి చనిపోతే కొందరు లావణ్య త్రిపాఠి అని హ్యాష్‌ట్యాగ్ జత చేశారు. దీంతో లావణ్య త్రిపాఠి తనకు సంబంధం లేకపోయినా.. ఆమె అనవసరంగా ఈ వివాదంలోకి వచ్చి చేరింది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఆమెపై నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. అయితే అన్ని కామెంట్లకు స్పందించడం కుదరదు. కానీ ఆమె ఇచ్చిన రిప్లై మాత్రం అందరికీ చేరి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…