Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఓ పాపులర్ యంగ్ హీరోతో ఈమె ప్రేమలో పడిందని, వీరు పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు గుప్పుమన్నాయి. అందుకనే ఆమెకు ప్రపోజ్ చేసేందుకు ఆ హీరో రూ.25 లక్షలు పెట్టి ఓ రింగ్ కూడా కొన్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై లావణ్య త్రిపాఠి ఇప్పటి వరకు స్పందించలేదు.
తాజాగా ఈ భామ షూటింగ్ మధ్యలో బ్రేక్ తీసుకున్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యాన్స్‌తో చాటింగ్ చేసింది. వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. ప్రస్తుతం హ్యాపీ బర్త్ డే అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఈమె.. షూటింగ్ బ్రేక్ సమయంలో లైవ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ పలు ప్రశ్నలు అడిగారు.
చాట్ సెషన్‌లో భాగంగా ఫ్యాన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు లావణ్య త్రిపాఠి ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. తన ప్రస్తుతం సినిమా షూటింగ్ వివరాలు, తన ఆహారపు అలవాట్లు, డైట్, ఇతర విషయాల గురించి ఫ్యాన్స్ అడగ్గా.. అందుకు ఆమె సమాధానాలు చెప్పింది.
అయితే ఓ దశలో కొందరు ఫ్యాన్స్ ప్రేమ, పెళ్లి వార్తలను అడిగారు. కానీ ఆమె ఆ ప్రశ్నలకు స్పందించలేదు. అసలు ఆ ప్రశ్నలను ఆమె పట్టించుకోలేదు. నిజంగా ఆమె లవ్‌లో లేకపోతే అలా ఫ్యాన్స్ అడిగితే ఆ వార్తలను ఖండించాలి. కానీ ఆమె అలా చేయలేదు. అసలు ఆ ప్రశ్నలను ఆమె పట్టించుకోలేదు. దీంతో అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈమె సదరు యంగ్ హీరోతో ప్రేమలో ఉన్నది నిజమే కాబోలునని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రానున్న రోజుల్లో అయినా ఈ బ్యూటీ స్పష్టత ఇస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…