Lata Mangeshkar : గాన కోకిలగా పేరు పొందిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మనందరికీ దూరమయ్యారు. ముంబైలోని సిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమె తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గత నెల రోజుల నుంచి ఆమె కరోనా కారణంగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. కాగా లతా మంగేష్కర్ ప్రస్తుత వయస్సు 92 ఏళ్లు.
భారత దేశం గర్వించదగ్గ గాన కోకిల అయిన భారతరత్న లతా మంగేష్కర్ మృతి తీవ్ర విచారకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె మరణం దేశానికి తీరని లోటు. సంగీత ప్రియులందరికీ ఆమె ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఆమె గొంతు 30 వేలకు పైగా పాటలు పాడింది. లతా దీదీ చాలా ప్రశాంత స్వభావం కలవారు. ప్రతిభతో కూడిన సంపన్నురాలు. దేశవాసులందరిలాగే లతా మంగేష్కర్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. నాకు సమయం దొరికినప్పుడల్లా ఆమె పాడిన పాటలను తప్పకుండా వింటాను. భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఆమె కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నాను. ఓం శాంతి.. అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్లు చేశారు.
కాగా కరోనా బారిన పడిన ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఆమె కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స తీసుకుంటున్నారని, ఆమెకు కోవిడ్ 19తోపాటు న్యుమోనియా కూడా సోకిందని.. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె కన్నుమూశారని.. వైద్యులు తెలిపారు. ఇక ఆమెకు డాక్టర్ ప్రతీత్ సమ్దానీ నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్సను అందించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…