Lalitha Jewellers : లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్‌ని చూస్తే డబ్బులు ఊరికే రావు అనే డైలాగ్ వెంటనే గుర్తుకు వస్తుంది. ఎలాంటి సెలబ్రిటీ సాయం తీసుకోకుండా తన కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ అందరిని ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు కిరణ్ కుమార్. చిత్తూరు నగరంలోని వేలూరు రోడ్డు చామంతి పురం లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువలరీ షోరూంను క్రీడా శాఖ మంత్రి రోజా బుధవారం ఉదయం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లలిత జ్యువలరీ తో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు అప్పుడు లలిత జ్యువెలరీ లోనే నగలు కొనుగోలు చేసే వారిని, అధినేత కిరణ్ కుమార్ అతి తక్కువ ధరలకు నాణ్యమైన నగలను అందించే వారని రోజా తెలిపారు. ఇప్పటిదాకా 45 బ్రాంచీలను ఓపెన్ చేసి.. జనాలకు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడదే వ్యక్తి తాజాగా చిత్తూరులో 46వ బ్రాంచ్ ఓపెన్ చేశాడు. రోజాతో రిబ్బన్ కట్ చేయించి కొత్త షోరూం ఓపెన్ చేసిన కిర్‌ణ కుమార్ మాట్లాడుతూ.. పిలవగానే వచ్చినందుకు రోజా గారికి థ్యాంక్స్. రీసెంట్ గా మా టీంతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి ఓపెనింగ్ కి రావాలని ఆహ్వానించాం . ఆ సమయంలో మాకు భోజనం పెట్టి మరీ మాకు మర్యాదలు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మనం అనుకున్న గెస్ట్ వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది” అంటూ రోజాని కొనియాడాడు.
గ్రీన్ అంబాసిడర్ గా రోజాను నియమిస్తారా అని కిరణ్ కుమార్ ను విలేకరులు అడగగా, ఆ ప్రశ్నకు రోజా స్పందిస్తూ కిరణ్ కుమార్ ఒక అంబాసిడర్ అని ప్రజల మధ్య అతనికి ఉన్న క్రేజ్ తో లలిత జ్యువెలర్స్ ఫేమస్ అయింది అన్నారు.అనంతరం లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ మాట్లాడుతూ సోదరి సమానురాలైన రోజాతో తనకున్న అనుబంధం గొప్పదని, పిలవగానే ప్రారంభానికి వచ్చిన రోజాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక రోజాపై ప్రశంసలు కురిపిస్తూ లలితా జ్యువలరీ ఓనర్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…