Kushboo Sundar : సౌత్ సినిమా ఇండస్ట్రీలో 1980-90లలో ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ కుష్బూ. వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు చిత్రంతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన కుష్బూ తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. తమిళనాడులో కుష్బూ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏకంగా అభిమానులు ఆమెకు గుడి కట్టేశారు. అంతటి క్రేజ్ ఉన్న కుష్బూ కూడా కెరీర్ మొదట్లో కాస్టింగ్ కౌచ్ బాధితురాలే అట. ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనేది ఓపెన్ సీక్రెట్. ఇటీవల చాలామంది హీరోయిన్లు ధైర్యంగా ముందుకొచ్చి దీని గురించి స్పందించిన విషయం తెలిసిందే.
అయితే కుష్బూ తన మొదటి సినిమాలో తనపై జరిగిన అసభ్య ప్రవర్తన గురించి, ఒక స్టార్ హీరో వల్ల తనకెదురైన చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. వెంకటేష్ కలియుగ పాండవులు సినిమా చేసేప్పుడు సెట్‌లో తనతో ఒకడు అసభ్యంగా ప్రవర్తించాడని ఎమోషనల్ అయింది కుష్బూ. షూటింగ్ ముగించుకుని మేడపైకి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒకడు తన వెనక భాగాన్ని తాకాడు. కోపంతో ఆమె వాడి చెంప పగలకొట్టింది. అప్పుడు అక్కడ సురేష్ బాబు కూడా ఉన్నారు. సెట్‌లో అందరూ నాకే సపోర్ట్ గా నిలిచారు అంటూ తన డెబ్యూ మూవీలో ఎదురైన చేదు సంఘటనని గుర్తు చేసుకుంది కుష్బూ.
ఇక ఆ తర్వాత మరో సినిమా అనుభవం గురించి స్పందిస్తూ.. ఏకంగా కమిట్మెంట్ అడిగారని షాకింగ్ కామెంట్స్ చేసింది. అది కూడా టాలీవుడ్ స్టార్ హీరో అని చెప్పింది. టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో తనను కమిట్ మెంట్ అడిగాడని.. దాంతో తనకు కోపం వచ్చిందని.. వెంటనే నీ కూతుర్ని నా తమ్ముడి గదిలోకి పంపిస్తే నేను కమిట్మెంట్ ఇస్తా అని చెప్పానని తెలిపింది. తాను ఇచ్చిన కౌంటర్ తో ఆ హీరో ఫేస్ మాడిపోయిందని.. ఆ దెబ్బతో తనతో జాగ్రత్తగా ఉండేవాడని కూడా తెలిపింది. అయితే ఆ స్టార్ హీరో పేరును మాత్రం కుష్బూ భయటపెట్టలేదు. ఇది తెలిసిన నెటిజన్లు ఇంతకీ ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరా అని చర్చించుకుంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…