Kota Srinivasa Rao : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఈయనకు మంచి గౌరవం ఇస్తారు. తెలుగులో ఎంతో అరుదైన నటుడు అంటూ ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కోట శ్రీనివాసరావుతో నటించడానికి గర్వపడతాం అంటూ చెప్పుకునే స్టార్ హీరోలు కూడా ఉన్నారు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు 750 సినిమాల్లో నటించారు.
విలక్షణ నటుడు గా కోటా శ్రీనివాసరావు తెలుగు తెరపై నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అప్పటిలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ లో కామెడీ ప్రేక్షకులను ఎంతగానో అలరించేది. ప్రస్తుతం కోటా వృద్ధాప్య సమస్యలతో సినిమాలలో పెద్దగా కనిపించటంలేదు. కానీ కోటా ఇండస్ట్రీ గురించి ఇప్పటి తరం నటుల గురించి ఆయన అభిప్రాయాలను పలు ఇంటర్వ్యూల ద్వారా పంచుకుంటున్నారు.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇంట్లో ఖాళీగా కూర్చోలేకపోతున్నాను సినిమాల్లో అవకాశాలు ఉంటే ఇవ్వండని డైరెక్టర్లకు, నిర్మాతలకు ఇలా ఎవరైనా కనిపిస్తే అడుగుతున్నారట. అందులో తప్పేముంది నాకు ఖాళీగా కూర్చొని ఉంటే పిచ్చెక్కుతోంది. అందుకే ఏదైనా సినిమాలో నటించాలి పనిచేయాలి అనుకుంటున్నాను అని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, వంశీ పైడిపల్లి వంటి వారు కనిపిస్తే అవకాశం ఇవ్వండని అడుగుతుంటానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
ఇక మహేష్ బాబు కనిపిస్తే నాకు సినిమాల్లో అవకాశం ఇవ్వమని అడిగితే అదేంటండీ మీలాంటి పెద్ద వారు అలా అడగడం ఏంటి అంటూ అన్నాడు. ఇక ఎన్టీఆర్, నాని ఇలా ఎవరైనా నాకు ఎదురుపడితే సినిమాలో అవకాశం అడుగుతాను. అందుకు నేను ఏమాత్రం మొహమాటపడను. అందులో ఏం తప్పు లేదు అని చెబుతూ.. పాత సినిమాల్లో హాస్యం ఉండేది ఇప్పటి సినిమాల్లో కామెడీ ఉంటోంది. హాస్యంతో ఎక్కడైనా ఎవరి ముందైనా నవ్వుకోవచ్చు కానీ ఇపుడున్న కామెడీ అలా కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక అప్పటి సినిమాలకు ఇప్పటి సినిమాలకు మధ్య తేడా తల్లి పాలకు, డబ్బా పాలకు ఉన్నంత తేడా ఉంది అంటూ ఇంటర్వ్యూ ద్వారా స్పందించారు సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…