Kiran Kumar : మనం టీవీల్లో అనేక సందర్భాల్లో చూసి ఉంటాం. బంగారం అనగానే ముందుగా ఆయన రూపమే మనకు ఠక్కున గుర్తుకు వస్తుంది. ఇతర బంగారు ఆభరణాలను విక్రయించే సంస్థలు హీరోయిన్లతో యాడ్స్ చేస్తుంటే.. ఆయన తన కంపెనీకి తానే యాడ్స్ చేస్తుంటారు. నాలుగు షాపులు తిరిగి ధరలు అడిగి తెలుసుకుని మరీ తమ వద్దకు రావాలని ఆయన చెబుతుంటారు. అవును.. ఈపాటికే ఆయన ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆయనే లలిత జ్యువెల్లర్స్ అధినేత ఎం.కిరణ్ కుమార్.
ఒకప్పుడు అందరిలాగే ఈయన కూడా మధ్య తరగతి కుటుంబంలోనే జీవించారు. కానీ బంగారం బిజినెస్‌లో ఈయన చేయి తిరిగింది. కోటీశ్వరుడు అయ్యారు. ఈ క్రమంలోనే తమ బంగారు షాపుల గురించి ఆయనే స్వయంగా ప్రచారం చేస్తుంటారు. దీంతో ఆయన యాడ్స్‌కు ఆదరణ బాగానే లభిస్తోంది. ఎప్పుడు బంగారం చెప్పినా ఆయన రూపమే మనకు గుర్తుకు వస్తుంది. అంతలా కిరణ్ కుమార్ సాధారణ ప్రజల జీవితాల్లోకి కూడా చొచ్చుకుపోయారు. అయితే ఆయన ఇటీవల రోడ్డు పక్కన ఓ బండి వద్ద టిఫిన్ చేస్తుండగా.. ఎవరో ఫొటో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటో వైరల్ అవుతోంది.
అన్ని కోట్లకు అధిపతి అయి ఉండి ఆయన అలా రోడ్డు పక్కన ఎందుకు టిఫిన్ చేస్తున్నారు. కావాలనుకుంటే ఆయన ఫైవ్ స్టార్ హోటల్‌కే వెళ్లవచ్చు కదా.. ఇంతకీ అసలు ఏం జరిగింది.. అని నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. అయితే ఆయన ఎక్సర్‌సైజ్ డ్రెస్‌లో ఉన్నారు. పక్కనే ఇంకో వ్యక్తి ఉన్నాడు. కనుక తన స్నేహితులతో వాకింగ్‌కు లేదా వ్యాయామానికి వెళ్లి ఉండవచ్చు. తరువాత దారిలో వస్తూ టిఫిన్ బండి దగ్గర ఆగి టిఫిన్ తిని ఉండవచ్చు.. అని తెలుస్తోంది. అంతేకానీ.. ఆయనకు ఏమీ కాలేదని.. కేవలం టిఫిన్ చేయడం కోసమే అక్కడ ఆగారని అర్థమవుతోంది.
ఎన్ని కోట్లు ఉన్నా రోడ్డు పక్కన బండి దగ్గర లభించే టిఫిన్లు భలే టేస్ట్ ఉంటాయి. కోటీశ్వరులు అయినా సరే మేడ నుంచి దిగి వచ్చి తినాల్సిందే. అలా ఆ టిఫిన్ల రుచి ఆయనకు నచ్చి ఉండవచ్చు. అందుకనే అక్కడ తిని ఉండవచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఈ ఫొటోపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అవి కూడా వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…