KGF Chapter 2 Movie Review : యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ మొదటి భాగం ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. కన్నడ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ఈ మూవీ పతాక స్థాయిలో నిలబెట్టింది. తెలుగు నాట కూడా కేజీఎఫ్‌ను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ క్రమంలోనే కేజీఎఫ్ 1 తరువాత ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా వచ్చేసింది. ఈ మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలై సంచలనాలను సృష్టిస్తోంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కేజీఎఫ్ 1లాగే కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.. సినిమా ఎలా ఉంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేజీఎఫ్ చాప్టర్ 2 కథ..
కేజీఎఫ్ మొదటి సినిమాలో రాకీ బంగారు గనుల్లోపనిచేసే కార్మికులకు దేవుడిగా మారుతాడు. వారిని హింసించి, వారి ప్రాణాలను తీసేవాళ్లను దారుణంగా చంపేస్తాడు. దీంతో ఆ కార్మికులు రాకీని తమ దేవుడిగా భావిస్తారు. ఇక ఆ బంగారు గనుల యజమాని అయిన గరుడను చివరకు రాకీ తుదముట్టిస్తాడు. ఈ క్రమంలో కేజీఎఫ్ రాకీ సొంతమవుతుంది. అక్కడి నుంచి కేజీఎఫ్ చాప్టర్ 2 మొదలవుతుంది.
అయితే బంగారు గనులను రాకీ సొంతం చేసుకోవడంతో రీనా తండ్రి రాజేంద్ర దేశాయ్, గరుడ సోదరుడు దయా, ఆండ్రూస్ తదితరులు రాకీ వెంట ఉండాల్సి వస్తుంది. అయితే రాకీ వీళ్లను ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. అలాగే రీనాను తనతోపాటు కేజీఎఫ్ కు తీసుకెళ్తాడు. అక్కడ రాకీ సెటిల్ అయిపోతాడు.
అయితే రాకీని కేజీఎఫ్ నుంచి బయటకు తీసుకురావాలని.. ఆ గనులను హస్తగతం చేసుకోవాలని చాలా మంది యత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే చనిపోయాడనుకున్న అధీరా (సంజయ్ దత్) బతికే ఉన్నాడని తెలిసి అతని ద్వారా రాకీని బయటకు తీసుకువచ్చేందుకు యత్నిస్తారు. మరి వాళ్ల ప్రయత్నం సఫలమైందా ? రాకీ బంగారు గనులను వదిలి బయటకు వచ్చాడా ? తరువాత ఏం జరిగింది ? చివరకు ఎలాంటి ముగింపును ఇచ్చారు ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.
కేజీఎఫ్ మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్‌లో వయొలెన్స్, యాక్షన్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. అందువల్ల మొదటి భాగం కన్నా రెండో భాగం మాస్ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తుందని చెప్పవచ్చు. మొదటి భాగం లాగే రెండో దాంట్లోనే యష్.. రాకీ పాత్రలో జీవించాడు. తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. అలాగే అధీరా పాత్రలో సంజయ్ దత్ మెప్పించారు. వీరితోపాటు శ్రీనిధి శెట్టి, ప్రధానిగా రవీనా టాండన్, సీబీఐ ఆఫీసర్ గా రావు రమేశ్, అనంత్ నాగ్ పాత్రలో ప్రకాశ్ రాజ్ లు అద్భుతంగా నటించారు. అందువల్ల నటీనటుల పెర్పార్మెన్స్ బాగుంటుంది.
ఇక కేజీఎఫ్ 2 ను మొదటి భాగం కన్నా అతి ఎక్కువ, భారీ సాంకేతిక విలువలతో నిర్మించారు. అనేక యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మొత్తంగా చెప్పాలంటే.. కేజీఎఫ్ 1 కన్నా కేజీఎఫ్ 2 ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తుందని చెప్పవచ్చు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను తెరకెక్కించారు. సాధారణంగా సీక్వెల్ చిత్రాలు నడవవు.. అనే వాదన ఉంది. కానీ బాహుబలి విషయంలో అది అబద్ధమని తేలింది. ఇక కేజీఎఫ్ విషయంలోనూ అదే రుజువు అయింది. అందువల్ల సీక్వెల్‌తో యష్ మరో హిట్ కొట్టారని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే.. యాక్షన్‌ను, థ్రిల్లర్‌ను కోరుకునే వారు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…