KGF 2 First Review : కన్నడ సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 1 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో భాగంగానే రెండో భాగం కూడా త్వరలో విడుదల కానుంది. కన్నడ స్టార్ హీరో యశ్ లీడ్ రోల్ చేస్తున్న చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్ 2. పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. హిందీతోపాటు దక్షిణాది భాషల్లోనూ ఈ మూవీ విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి స్వయం ప్రకటిత యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు, స్వయం ప్రకటిత సినీ అనలిస్ట్ ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు.
కేజీఎఫ్ 2 కన్నడ సినిమాకు కీర్తి కిరీటం లాంటిది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో నిండిపోయింది. పదునైన డైలాగ్స్ అదిరిపోయాయి. బీజీఎం దాన్ని బ్యాలెన్స్ చేసింది. ఇదొక అద్భుతమైన మూవీ. సినిమా ఆద్యంతం అదే ఇంటెన్సిటినీ చూపించడంలో డైరెక్టర్ పనితనం గొప్పగా ఉంది. సినిమాలో నటించినవాళ్లంతా అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇది కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన బ్లాక్ బ్లస్టర్ కాదు.. ఇదొక వరల్డ్ క్లాస్ మూవీ. యశ్, సంజయ్ దత్ పాత్రలు అమితంగా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ మిమ్మల్ని షాక్‌కి గురిచేస్తోంది. గూస్ బంప్స్ అంతే.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉమైర్ సంధు తన రివ్యూ వెల్లడించారు.
ఈ సినిమాలో శ్రీనిధి హీరోయిన్‌గా నటించగా.. సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ అధీరా పాత్రలో నటించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. రవీనాటాండన్ మరో ముఖ్య పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్ 2 ట్రైలర్‌కు అద్బుతమైన రెస్సాన్స్ వస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…