KBC : బాలీవుడ్ బిగ్ స్టార్ అమితాబచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం 13వ సీజన్ ఎంతో విజయవంతంగా ప్రసారమవుతోంది. తాజాగా ఈ కార్యక్రమానికి మహారాష్ట్రలోని జల్‌గావ్‌కి చెందిన భాగ్యశ్రీ అనే మహిళ వచ్చింది. ఈమె గేమ్ ఆడటానికి ముందుగా తన వ్యక్తిగత విషయాలను అమితాబ్ తో పంచుకుని భావోద్వేగం అయ్యింది. ఈ క్రమంలోనే ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తాను ప్రేమ వివాహం చేసుకున్నానని.. తనకు కూతురు పుట్టినా తన తండ్రి ఇప్పటి వరకు తనతో మాట్లాడలేదని బావోద్వేగ మయ్యింది.
ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్.. భాగ్యశ్రీ తండ్రి చూస్తూ ఉంటే క్షమించి తనను అక్కున చేర్చుకోండి.. అంటూ తన తండ్రికి సూచించారు. ఇలా అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ 80 సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులది కూడా ప్రేమ వివాహమే అని, వారి ఇద్దరి కులాలు వేరే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.
అయితే వారు పెళ్లి చేసుకున్న తర్వాత తను స్కూల్లో చేర్పించడానికి ఇంటి పేరు ఏంటి అని ప్రశ్నించగా తన తల్లిదండ్రులు వారి ఇద్దరి కులానికి చెందిన ఇంటి పేరును కాకుండా తన తండ్రి కథలు రాయడంతో అతని కలం పేరును బచ్చన్ అని పెట్టుకున్నారు. అలా తన పేరు చివర ఇంటి పేరుగా బచ్చన్ అని వచ్చిందని ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ అనే పేరు వెనుక దాగి ఉన్న కథను తెలియజేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…