Katrina Kaif : బాలీవుడ్ స్టార్ నటీనటులైన విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల వివాహం జరగబోతుంది. దీనికోసం రాజస్థాన్ లో సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 7 నుండి 12 తేదీల మధ్య ఉన్న డేట్స్ లో వీరి వివాహం ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే పెళ్ళికి సంబంధించిన హోటల్ కూడా బుకింగ్స్ పూర్తయినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీఐపీ వివాహాలను ఆర్గనైజ్ చేయడానికి ఈవెంట్ కంపెనీల ఏజెంట్స్ ఈ సవాయ్ మాధోపూర్ లో ఉన్న హోటల్ రూమ్స్ ని వెతుకుతున్నారట.
అలాగే కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల టీమ్ కూడా వీరి పెళ్ళికి పనులు స్టార్ట్ చేశారు. పెళ్ళికి సంబంధించిన పనులు చెక్ చేసేందుకు.. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల పర్సనల్ అసిస్టెంట్స్ 10 మంది వరకు రీసెంట్ గా సిక్స్ సెన్సెస్ బర్వారా కోటకు చేరుకుని పరిశీలించారు. అలాగే హోటల్ యాజమాన్యం అందించిన సమాచారం మేరకు పెళ్ళికి సంబంధించిన అన్ని పనలు చకచకా జరుగుతున్నట్లు తెలిపారట.
ఇక పెళ్ళి కొడుకు గుర్రం మీద కూర్చుని ఎక్కడ నుండి వస్తారు.. మెహందీ ఎక్కడ ఆర్గనైజ్ చేస్తారు, సంగీత్ ప్లాన్ ఏంటి.. ఇలాంటవన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్ళి అంగరంగ వైభవంగా జరగబోతుంది. అయితే పెళ్ళిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…