Kasthuri Shankar : ఈ ఆదివారం నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. వారిద్దరూ కవలలకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యినట్టు ప్రకటించారు. నయన్ అండ్ శివన్ ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలోని ఒక ప్రసిద్ధ రిసార్ట్‌లో కుటుంబ సమేతంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళై 4 నెలలు కూడా గడవకముందే కవల అబ్బాయిలకు నయన్ విగ్నేష్ తల్లిదండ్రులు అయ్యారు. అద్దె గర్భం.. అంటే మరో మహిళ గర్భంతో వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. చాలామంది సెలెబ్రిటీలు ఇదే విధానంలో తల్లిదండ్రులు అవుతున్నారు.
ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మి, శిల్పా శెట్టి, కరణ్ జోహార్ లాంటి సీలెబ్రిటీలంతా సరోగసి విధానం ద్వారా పిల్లల్ని కన్నారు. అయితే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. నయనతారకి కవలలు పుట్టిన వేళ సీనియర్ హీరోయిన్ కస్తూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారతదేశంలో సరోగసీ నిషేధించబడింది. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప, అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడం చట్టరీత్యా నేరం.
ఇది జనవరి 2022 నుండి వచ్చిన చట్టం. దీని గురించి మనం చాలా రోజులుగా వింటూనే ఉన్నాం అంటూ ట్వీట్ చేసింది. కస్తూరి ఈ ట్వీట్ నయనతారని ఉద్దేశించే చేసింది అంటూ కొందరు ఆమెని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మరికొందరు ఈ విషయాన్ని ధైర్యంగా చెబుతున్నారు అంటూ ఆమెకు సపోర్ట్ చేశారు. నన్ను విమర్శించే వాళ్లకు ముందే తెలిసి ఉండాలి. నేను అన్ని వివరాలు తెలుసుకునే ఈ కామెంట్స్ చేశాను. నా లెక్కలు నాకు ఉన్నాయి. నిస్వార్థంగా నా గళం వినిపిస్తున్నాను అంటూ కస్తూరి మరో ట్వీట్ చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…