Karthikeya 2 : ఓటీటీలోనూ తగ్గని కార్తికేయ 2 హవా.. ఏకంగా 100 కోట్ల స్ట్రీమింగ్ మిన‌ట్స్‌..

Karthikeya 2 : ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన కార్తికేయ 2 మానియానే క‌నిపిస్తుంది. ఎన్నో వాయిదాల త‌ర్వాత‌ విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. తొలిరోజు లిమిటెడ్ స్క్రీన్‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రం రెండో రోజుకు స్క్రీన్ కౌంట్ రెట్టింపైంది. ఇక ఫ‌స్ట్‌డేకు మించిన క‌లెక్ష‌న్‌ ల‌ను సెకండ్ డే సాధించి.. కంటెంట్ ఉంటే క‌లెక్ష‌న్ల‌కు తిరుగుండదని మరోసారి నిరూపించింది. కేవ‌లం టాలీవుడ్‌లోనే కాకుండా విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ ఈ మూవీ మంచి వసూళ్ళ‌ను సాధించింది.

ముఖ్యంగా బాలీవుడ్‌లో రోజు రోజుకూ కార్తికేయ 2పై క్రేజ్ పెరిగిపోయింది. కార్తికేయ 2 చిత్రం బాలీవుడ్‌లో మొద‌టి రోజు కేవ‌లం 60 స్క్రీన్‌ల‌లో విడుద‌లైంది. ఇక రెండో రోజు ఏకంగా 300 స్క్రీన్లు పెరిగాయి. దీనికి పోటీగా అమీర్‌ఖాన్ లాల్ సింగ్ చ‌డ్డా, అక్ష‌య్ కుమార్ ర‌క్షా బంధ‌న్ వంటి సినిమాలున్నా బాలీవుడ్ ప్రేక్షకులు కార్తికేయ 2 చిత్రం వైపే మొగ్గు చూపారు. ఊహించని స్థాయిలో ఏకంగా రూ.120 కోట్ల కలెక్ష‌న్లతో దుమ్మురేపింది. ఈ చిత్రంతో యంగ్ హీరో నిఖిల్‌కు బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. థియేటర్లలో సందడి చేసి.. తాజాగా ఓటీటీని పలకరించింది.

Karthikeya 2

థియేటర్లలో ఎగబడి చూసినా.. ఓటీటీలోనూ తన హవా కొనసాగించింది కార్తికేయ 2. దసరా సందర్భంగా జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఈ సినిమా సరికొత్త రికార్డుల‌ను సృష్టించింది. ఓటీటీలో విడుదలైన 48 గంటల్లోనే ఏకంగా 100 కోట్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని జీ5 స్వయంగా తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా వెల్లడించింది. కృష్ణతత్త్వం నేపథ్యంలో తెరకెక్కిన కార్తికేయ 2 తెలుగు కంటే హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి కీలకపాత్రల్లో నటించి మెప్పించారు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

Black Marks On Tongue : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే..!

Black Marks On Tongue : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో నాలుక కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు రుచిని…

Thursday, 16 May 2024, 11:30 AM

Cabbage Onion Pakoda : ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఇలా క్యాబేజీతో క‌లిపి వెరైటీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Cabbage Onion Pakoda : ప‌కోడీలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడిగా ప‌కోడీల‌ను తింటే ఎంతో…

Wednesday, 15 May 2024, 8:20 PM

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను వీరు ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు..!

Pomegranate : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. ఇవి…

Wednesday, 15 May 2024, 3:39 PM

Mango Ice Cream : మామిడి పండ్ల‌తో ఎంతో టేస్టీ అయిన ఐస్‌క్రీమ్‌.. ఇంట్లోనే ఇలా చేసేయండి..!

Mango Ice Cream : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌నకు మామిడి పండ్లు విరివిగా ల‌భిస్తుంటాయి. వీటిని చాలా మంది…

Wednesday, 15 May 2024, 9:08 AM

Mangoes : మామిడి పండ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటితో క‌లిపి తిన‌కండి.. లేని పోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!

Mangoes : ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఎండ‌లు మండిపోతున్నాయి. దీంతో జ‌నాలు అంద‌రూ చ‌ల్ల‌ని మార్గాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.…

Tuesday, 14 May 2024, 8:11 PM

Jonna Rotte : జొన్న రొట్టెల‌ను చేయ‌డం రావ‌డం లేదా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Jonna Rotte : చ‌పాతీ, రోటీ, నాన్‌.. తిన‌డం మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు వాటి స్థానంలో జొన్న రొట్టెని లొట్ట‌లేసుకుంటూ…

Tuesday, 14 May 2024, 5:01 PM

Gold Price Today : బంగారం కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గుతున్న ధ‌ర‌లు..!

Gold Price Today : ఈమ‌ధ్య‌కాలంలో బంగారం ధ‌ర‌లు ఎలా పెరిగాయో అంద‌రికీ తెలిసిందే. ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోయాయి. అయితే…

Tuesday, 14 May 2024, 8:20 AM

Black Coffee Health Benefits : రోజూ ఉద‌యాన్నే బ్లాక్ కాఫీ తాగితే క‌లిగే 10 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Black Coffee Health Benefits : ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది బెడ్ కాఫీ లేదా టీ తాగుతుంటారు.…

Monday, 13 May 2024, 7:08 PM