Karthikeya 2 Review : వైవిధ్యభరితమైన చిత్రాలలో నటించడంలో యంగ్ హీరో నిఖిల్‌కు మంచి పేరే ఉంది. ఈయన ఏ మూవీ చేసినా అందులో అద్భుతమైన కథ ఉంటుంది. అనవసరపు విషయాల జోలికి వెళ్లకుండా మొత్తం కథ మీదే ఫోకస్ పెట్టి సినిమాలను చేస్తారు. కనుకనే గతంలో వచ్చిన కార్తికేయ మొదటి సినిమాతోపాటు ఎక్కడికి పోతావు చిన్నవాడా.. తదితర చిత్రాలు హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మళ్లీ కార్తికేయ 2తో నిఖిల్ మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ శనివారం థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది ? కథ ఏమిటి ? ప్రేక్షకులను ఏ మేర అలరిస్తోంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
కార్తికేయ మొదటి సినిమాకు కార్తికేయ 2కు అసలు సంబంధం లేదు. సీక్వెల్ కాదు. ఈ మూవీలో పూర్తిగా కొత్త కథను చూపించారు. కార్తీక్ ఒక ప్రొఫెసర్. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాలి పాదానికి ధరించిన ఒక పట్టీ చుట్టూ కథ తిరుగుతుంది. అది ఎక్కడ ఉంటుంది ? దానికి కార్తీక్‌కు సంబంధం ఏమిటి ? దాని కోసం ఎవరు అన్వేషిస్తుంటారు ? చివరకు ఏమవుతుంది ? కార్తీక్ ఏం చేస్తాడు ? వంటి విషయాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
సాధారణంగా సినిమా అంటే అన్ని కమర్షియల్ హంగులు ఉంటాయి. దీంతో కథను కాస్త సైడ్ ట్రాక్ పట్టిస్తారు. కానీ కార్తికేయ 2లో అలా జరగలేదు. దర్శకుడు చందూ మొండేటి పూర్తిగా కథపైనే ఫోకస్ పెట్టారు. కనుక మొదటి నుంచి చివరి వరకు కథపైనే ఫోకస్ ఉంటుంది. ప్రేక్షకుల దృష్టి మళ్లదు. కార్తికేయ మొదటి పార్ట్‌కు దీంతో సంబంధం లేదు. అది పూర్తిగా హార్రర్, మిస్టరీ కథాంశాలతో వచ్చింది. ఇప్పుడు వచ్చిన మూవీని కూడా ఇదే జోనర్‌లో తెరకెక్కించారు. అందువల్ల ప్రేక్షకులు ప్రతి సీన్‌లోనూ థ్రిల్‌కు గురవుతుంటారు. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉంటుంది. దీన్ని సరిగ్గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అందువల్ల ఈ మూవీ సీన్ టు సీన్ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
కార్తికేయ 2లో నిఖిల్ అదరగొట్టాడు. ఇలాంటి రోల్స్ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కార్తికేయ మొదటి పార్ట్‌లోనూ సీరియస్‌నెస్‌తో కథను ముందుకు తీసుకెళ్తారు. అందులో నిఖిల్ అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. ఆయన నటనకు పేరు పెట్టాల్సిన పనిలేదు. అలాగే అనుపమ పరమేశ్వరన్ రోల్ కూడా ఈ మూవీలో ముఖ్యమైనదే. కమెడియన్ శ్రీనివాస రెడ్డి సహాయక పాత్రలో న్యాయం చేశారు. ఈ మూవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌కు తెలుగులో మొదటిది. అయినప్పటికీ తన పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఇక వైవా హర్ష, ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు.
ఈ సినిమాకు కాలభైరవ అందించిన సంగీతం బాగుంటుంది. పలు శ్లోకాలను మూవీలో చేర్చారు. అందువల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది. కార్తీక్ ఘట్టమనేని అద్భుతంగా సీన్లను చూపించారు. ఆయన ఎడిటింగ్ బాధ్యతలను కూడా నెరవేర్చారు. ఇక సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ ఉండదు. కొన్ని సీన్లను మరీ అసంపూర్తిగా తీశారని అనిపిస్తుంది. ఇవి రెండే దీనికి మైనస్ పాయింట్లు. అలాగే కొత్త కథ కావడం, నిఖిల్ యాక్టింగ్, డైలాగ్స్, లొకేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ సంగీతం వంటివి సినిమాకు ప్లస్ పాయింట్స్. కనుక ఓవరాల్‌గా చూస్తే కార్తికేయ 2 ఫ్రెష్ మూవీ అని చెప్పవచ్చు. ఈ వీకెండ్‌లో చూడదగ్గ సినిమా ఏదైనా ఉందంటే.. అది కార్తికేయ 2 అని చెప్పవచ్చు. ప్రేక్షకులు ఈ మూవీని తప్పక చూడాలి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…