Karthikeya 2 : కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా ఆగస్ట్ 13న కార్తికేయ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు హీరో నిఖిల్. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి కార్తికేయ 2 చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నిఖిల్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్య మీనన్, సత్య, తులసి, ప్రవీణ్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కార్తికేయ2 చిత్రంలో కృష్ణుడి గురించి కొన్ని విషయాలు చెప్పడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్తికేయ 2 చిత్రంలో కృష్ణుడి గురించి చెప్పిన అద్భుతమైన విషయాలు ఏమిటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం.
గీతలో కోట్లాది మంది దారి చూపిన అతని కన్నా గొప్ప గురువు ఎవరు..?, నమ్మిన వారి కోసం ఎంతటి వారినైనా ఛేదించే అతని కన్నా గొప్ప నమ్మకస్తుడు ఎవరు..? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరానికి నిర్మించిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు..? యుద్ధం చేస్తే లక్షలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోతాయి. భూమిపై రక్తం ఏరులై పారుతుంది. యుద్ధం కన్నా సంధి ముద్దు అని చెప్పి ఉంచడానికి శతకోటి ప్రయత్నాలు చేసినా అతని కన్నా ముందుచూపు గల శాంతిదూత ఎవరు..? వేణు గానముతో గోవుల్ని, గోపికలను తన మాయలో పడేసే గొప్ప మ్యూజిషియన్ ఎవరు.? ఒక చూపుతోనే మనసులో మాటను అర్థం చేసుకోగల తన కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు..?
నిత్యం ఆరోగ్యంతో ఉండాలి అని సూచించే అతని కన్నా గొప్ప డాక్టర్ ఎవరు..? ధర్మం కోసం యుద్ధం చేయాలని చెప్పిన అతన్ని మించిన వీరుడు ఎవరు..? కరువు కష్టం లేకుండా చూస్తున్న అతని కన్నా మించిన రాజు ఎవరు..? హోమ యాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్టు ఎవరు..? నమ్ముకున్న వాళ్ళ వెంట ఉండి విజయమైనా వీర స్వగ్రామమైనా కర్తవ్యం ముఖ్యం. ఫలితం ఏదైనా కానీ అది దైవాధీనం అని చెప్పే దార్శనికుడు ఎవరు..?
మరణం ఎప్పటికైనా తథ్యం అని గీత ద్వారా చెప్పి నడిపించిన అతని కన్నా గొప్ప విరాగి ఎవరు..? అతనొక మెజీషియన్, మ్యూజిషియన్, ఒక టీచర్, ఒక వారియర్, ఒక ఫైటర్, ఒక సింగర్, గ్రేట్ కింగ్, అనంత బ్రహ్మాండాన్ని తనలో ఇముడ్చుకున్న ఒక సృష్టి. కృష్ణుడు అంటే ఆనందం, బ్రహ్మ స్వరూపం, సత్యం, అన్ని దైవ స్వరూపాలు ఆత్మ తత్వాన్ని బోధించేవే. కృష్ణుడిని దేవుడు అనే భక్తితో కన్నా ఒక గురువుగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తే జీవితంలో ఎన్నో కష్ట సుఖాలను దాటి అద్భుతాలు చేయవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…