Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో హిమ.. అమ్మ నాన్న ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. అంతలోనే శౌర్య వచ్చి బస్తీలో ఇల్లు కడుతున్న విషయాన్ని చెబుతుంది. వెంటనే హిమ సంతోషంగా ఫీల్ అవుతుంది. అక్కడ ఉంటే అందరూ ఉంటారు. సంతోషంగా ఉంటుందని అనుకుంటారు. మరోవైపు మోనిత సంతోషంగా కార్తీక్ ఫోటో చూస్తూ మురిసిపోతుండగా ప్రియమణి ఆశ్చర్యపోతుంది.
ఇక ప్రియమణిని చూసిన మోనిత నేను ఇలాగే ఉంటాను అంటూ కార్తీక్ నుండి దీపను వేరు చేయాలని అంటుంది. తక్కువ చదువుకున్నా కూడా ల్యాబ్ లో నిజాన్ని పసిగట్టిందని అనుకుంటుంది. దీప పని ఎలాగైనా చేయాలనుకుంటుంది.
సౌందర్య ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుంటూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఇక అందరూ ఒక చోట ఉండి బస్తీ సైట్ గురించి మాట్లాడుకుంటారు. కార్తీక్ తనను హాస్పిటల్ లో డాక్టర్ అసోసియేషన్ అధికారిగా ఎన్నుకుంటున్నారని చెప్పడంతో సంతోషంగా ఫీల్ అవుతారు.
మోనిత ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతుంది. దీప అందరికీ చూపించిన వీడియోను తలుచుకుంటూ మండిపడుతుంది. అప్పుడే డాక్టర్ భారతి ఫోన్ చేసి హాస్పిటల్‌లో డాక్టర్ అసోసియేషన్ మెంబర్‌గా కార్తీక్ ను ఎన్నుకుంటున్నామని.. రావట్లేదా.. అనేసరికి మోనిత రానని క్లారిటీ ఇస్తుంది.
వెంటనే భారతి కార్తీక్ కు ఫోన్ చేసి మోనిత రానన్న విషయాన్ని చెప్పడంతో రిలీఫ్ అవుతాడు. మరోవైపు సౌందర్య, ఆనందరావు కూడా బయల్దేరుదామని అనుకుంటుండగా ఆదిత్య వచ్చి ఎక్కడికని అడుగుతాడు.
కార్తీక్ అందుకుంటున్న గుర్తింపు గురించి చెబుతూ శ్రావ్యను తీసుకొని రమ్మని అంటుంది. ఆదిత్య మాత్రం అక్కడకు మోనిత వస్తుంది కదా మళ్లీ అక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయని అనేసరికి తను రావట్లేదని చెబుతుంది.
ఆదిత్యను రమ్మని అనడంతో ఇవాళ దీపుని ఇంటికి తీసుకు వస్తానని అక్కడికి వెళ్తున్నామని అంటాడు. తరువాయి భాగంలో దీప, కార్తీక్ అసోసియేషన్ ఎన్నికల దగ్గరికి వెళ్తారు. సౌందర్య కార్తీక్ గురించి మాట్లాడటంతో మోనిత ఎంట్రీ ఇచ్చి షాకిస్తుంది. ఇక దీప కూడా రివర్స్ లో మోనితను గట్టి దెబ్బ కొడుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…