Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ కార్తీకదీపం. ఒకరోజు ఆహారం తీసుకోకుండా ఉండగలరు కానీ కార్తీకదీపం చూడకుండా అభిమానులు ఉండరు. అంత క్రేజ్ ని సంపాదించుకుంది ఈ సీరియల్. దీప, కార్తీక్ పాత్రలు ఈ సీరియల్ కు ఎంతో హైలెట్ గా నిలిచాయి. వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్, డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఐపీఎల్ మ్యాచ్, బిగ్ బాస్ షో లాంటివి కూడా ఈ సీరియల్ టీఆర్‌పీ రేటింగ్ లని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. దాదాపుగా 1400 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుని ఇప్పటికీ నంబర్ వన్ సీరియల్ గా నిలిచింది కార్తీకదీపం. ప్రస్తుతం ఈ కథ వారి పిల్లలు శౌర్య, హిమ క్యారెక్టర్లతో స్టోరీ నడుస్తోంది. కానీ డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత లేని కార్తీకదీపం కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిందని చెప్పవచ్చు. ఇప్పుడు మళ్లీ సీరియల్ లోకి వంటలక్క తిరిగి రాబోతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ అసలు వివరాల్లోకి వెళితే.. ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా కార్తీకదీపం సీరియల్ కి సంబంధించిన గెటప్ తో వీడియో ఒకటి షేర్ చేసింది. ప్రేమి విశ్వనాథ్ ఈ వీడియోలో వంటలక్క గెటప్ వేసుకుంటూ రెడీ అవుతున్న సమయంలో దీప మేడమ్ షాట్ మేడమ్ అని వినిపించడంతో వస్తున్నా అంటూ చెప్పడం విశేషం.
ఇదే కాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో వీడియోతో పాటు వస్తున్నా.. మీకోసం.. అంటూ క్యాప్షన్ కూడా జత చేసింది. అంటే ఈ వీడియో ద్వారా వంటలక్క కార్తీక దీపం సీరియల్ లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే కార్తీకదీపం అభిమానులకు దీప ఎంట్రీతో ఫుల్ జోష్ వచ్చినట్లే. నెటిజన్లు సైతం ఆనందంతో లవ్ ఇమేజిస్ పెడుతూ విల్ యూ బ్యాక్ ఎగైన్.. వెయిటింగ్ అండ్ హ్యాపీ.. అంటూ, అదేవిధంగా డాక్టర్ బాబు కూడా వస్తున్నాడా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…