RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఈ క్రమంలో గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకి కన్నడ ప్రేక్షకుల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా కన్నడ ప్రేక్షకులు #BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ మారుమ్రోగిపోయేలా ట్వీట్లు చేస్తున్నారు. ఇలా కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాని బాయ్‌కాట్ చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమా కర్ణాటకలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను కన్నడనాట స్టార్ హీరోల సినిమాలకి ఏ మాత్రం తీసిపోకుండా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని కర్ణాటకలో కన్నడలోనే విడుదల చేయాలని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ రాజమౌళికి రిక్వెస్ట్ చేశారు.
అయితే శివ రాజ్ కుమార్ మాటకు ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా రాజమౌళి ఈ సినిమాను కర్ణాటకలో కూడా తెలుగులో ఎక్కువగా విడుదల చేస్తుండడంతో.. కన్నడ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివ రాజ్ కుమార్ అడిగినా కూడా ఆయన మాటకు ఏమాత్రం విలువ లేదంటూ ఆరోపిస్తున్నారు. ఈ సినిమాని బాయ్‌కాట్ చేస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా #BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక బాహుబలి విషయంలో కూడా కన్నడ ప్రేక్షకులు ఈ విధంగానే వ్యవహరించారు. దీంతో తెలుగు ప్రేక్షకులు త్వరలోనే కేజీఎఫ్ 2 విడుదల అవుతుందని.. ఆ విషయాన్ని కన్నడ ప్రేక్షకులు కూడా గుర్తు పెట్టుకోవాలంటూ.. చెబుతున్నారు. మరి కేజీఎఫ్ 2 విడుదల అయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…