Karate Kalyani : నటి కరాటే కల్యాణి ఈ మధ్య తరచూ వార్తల్లో నిలిచిన విషయం విదితమే. ఈమె శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్‌ను ప్రాంక్ వీడియోలు చేస్తున్నాడనే కారణంతో రాత్రిపూట అతని ఇంటికి వెళ్లి మరీ కొట్టింది. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఈ కేసు ఇంకో టర్న్ తీసుకుంది. కరాటే కల్యాణి ఎలాంటి పత్రాలను లేకుండానే ఓ పాపను దత్తత తీసుకుందని కేసు నమోదు అయింది. దీంతో విచారణ జరిగింది. అయితే పాప తల్లిదండ్రులే తమకు స్థోమత లేక పెంచేందుకు ఆమెకు ఇచ్చామని చెప్పారు. దీంతో అధికారులు ఆమెకు అన్ని పత్రాలతోనే దత్తత తీసుకోవాలని చెప్పారు. దీంతో ఆ కేసులో కల్యాణికి క్లీన్ చిట్ లభించింది. అయితే కల్యాణి ఇప్పుడు ప్రాంక్ వీడియోలు చేసే యూట్యూబ్ చానల్స్‌పై పడింది. ఆమె ఆ చానల్స్ భరతం పట్టేందుకు నడుం బిగించింది.
ప్రాంక్ వీడియోల పేరిట యూట్యూబ్‌లో వీడియోలను పెడుతున్న సుమారు 20 చానల్స్‌పై కల్యాణి ఫిర్యాదు చేసింది. ఆ చానల్స్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కల్యాణి తన కంప్లెయింట్‌లో కోరింది. దీంతో సీసీఎస్ పోలీసులు సదరు చానల్స్‌పై ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. 67ఎ, 509 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే అలాంటి చానల్స్‌పై తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
అయితే యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో మొదట వివాదం జరిగింది ఈ ప్రాంక్ వీడియోల వల్లే. కానీ ఆమె ఆ పాపను పెంచుకుంటుండడంపై ఆరోపణలు రావడంతో ప్రాంక్ వీడియోల కేసు పెండింగ్‌లో పడింది. అయితే ఇప్పుడు ఆమెకు దత్తత కేసులో ఊరట లభించడంతో.. ఇక ముందుగా అనుకున్నట్లుగానే ఆమె అలాంటి చానల్స్‌పై యుద్ధం ప్రకటించింది. దీంతో ఆ చానల్స్‌ను బ్లాక్ చేయాలని ఆమె కేసు పెట్టింది. అయితే పోలీసులు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…