Kalyani : క‌రాటే క‌ల్యాణి మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు.. అరెస్టు, జైలు శిక్ష త‌ప్ప‌దా..?

Kalyani : న‌టి క‌రాటే క‌ల్యాణి ద‌త్త‌త కేసు రోజుకో కొత్త మ‌లుపు తిరుగుతోంది. అస‌లు ఆమెకు, యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డికి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ కాస్తా.. ఆమె వ్య‌క్తిగ‌త కేసుగా మారింది. ఆమె చిన్న పిల్ల‌ల‌ను కొనుగోలు చేసి విక్ర‌యిస్తుంద‌ని ఫిర్యాదులు అంద‌డంతో ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఆమె పెంచుకుంటున్న బిడ్డ‌ను ద‌త్త‌త తీసుకుందా.. తీసుకుంటే అందుకు సంబంధించిన ప‌త్రాలు ఏవి ? అని వారు ఆరాలు తీశారు. అయితే ఆ స‌మ‌యంలో ఇంట్లో క‌ల్యాణి లేదు. దీంతో ఆమె త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి త‌న కుమార్తెను ఎవ‌రో కిడ్నాప్ చేశార‌ని.. త‌న కుమార్తె ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని.. ఆమె ఆ బిడ్డ‌ను ద‌త్త‌త తీసుకునే పెంచుకుంటుంద‌ని తెలిపింది.

అయితే క‌ల్యాణి ద‌త్త‌త తీసుకున్న‌ది అధికారికంగా కాద‌ని రుజువైంది. ఆమె 24 గంట‌ల మిస్సింగ్ అనంత‌రం హ‌ఠాత్తుగా మీడియా ముందుకు వ‌చ్చింది. స‌ద‌రు పాప‌కు చెందిన త‌ల్లిదండ్రుల‌ను చూపిస్తూ ఆమె అసలు విష‌యాల‌ను వెల్ల‌డించింది. తాను వారి నుంచి పాప‌ను కొన‌లేద‌ని.. వారికి ఆర్థిక స్థోమ‌త లేక పెంచుకోమ‌ని త‌న‌కు ఇచ్చార‌ని.. అయితే ఇంకో ఏడాది అయ్యాక పాప‌ను అధికారికంగా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ద‌త్త‌త తీసుకుందామ‌ని.. కానీ దీన్ని కొంద‌రు రాద్ధాంతం చేస్తున్నార‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. అయితే ఇక్క‌డ ఒక్క విష‌యం మాత్రం స్ప‌ష్ట‌మైంది. ఆ బిడ్డ‌ను ఎలాంటి ప‌త్రాలు లేకుండానే ఆమె తీసుకుంది. స‌రే.. ఆమె చేస్తున్న‌ది మంచి ప‌నే. కానీ చ‌ట్టం దృష్టిలో ఆమె చేసింది మాత్రం నేర‌మే. దీంతో ఆమెపై చ‌ర్య‌లు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

Kalyani

ఇక క‌ల్యాణికి ఇప్ప‌టికే హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శ‌ర్మ‌న్ నోటీసులు జారీ చేశారు. 24 గంట‌ల్లోగా త‌మ వ‌ద్ద క‌ల్యాణి హాజ‌రు కావాల‌ని అన్నారు. అయితే ఆమె 24 గంట‌ల నుంచి క‌నిపించ‌కుండా పోయి స‌డెన్‌గా ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో తాను మిస్సింగ్ కాద‌ని.. అంద‌రి మ‌ధ్య‌నే ఉన్నాన‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. అయితే క‌ల్యాణి హాజ‌రు కాక‌పోవ‌డంతో ఇంకో నోటీసు ఇస్తామ‌ని.. మ‌ళ్లీ 24 గంట‌లు వేచి చూశాక‌.. అప్ప‌టికీ ఆమె రాక‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. ఆమెను అరెస్టు చేస్తామ‌ని.. ఇలాంటి కేసుల్లో నిందితుల‌కు 3 ఏళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు. అయితే ఈ కేసు ముందు ముందు ఇంకా ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM