Karan Arjun Movie Review : చిన్న సినిమాలను ఓటీటీల్లోనే కాదు.. థియేటర్లలోనూ ప్రేక్షకులు ప్రస్తుతం ఎంతో ఆదరిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే అనేక మూవీలు రిలీజ్ అయి హిట్ సాధించాయి. ఇక ఇదే కోవలో ఎలాంటి అంచనాలు లేకుండానే కరణ్ అర్జున్ అనే మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ జూన్ 24న పెద్ద ఎత్తున ఏకంగా 186 థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులను ఏ విధంగా అలరించింది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో డా.సోమేశ్వర రావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం.. కరణ్ అర్జున్. ఈ చిత్రానికి రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదలైంది. ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే..
కథ..
కరణ్ ఒక అనాథ శరణాలయంలో పెరుగుతాడు. అతన్ని దత్తత తీసుకోవాలని అనితా చౌదరి, రఘు అనాథాశ్రమానికి వచ్చి కరణ్ ను తీసుకెళ్లే టైంలో తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ కాల్ వస్తుంది. దీంతో వారు వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే అమ్మ కోసం ఎదురు చూస్తుంటాడు కరణ్. కానీ అనితా చౌదరి రాకుండా భర్త వచ్చి కరణ్ ను తీసుకెళ్ళి బాగా చదిస్తాడు. ఆ తరువాత వృషాలితో పెళ్లి ఫిక్స్ చేయడంతో తనకి కాబోయే భార్య వృషాలి తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళతాడు. అక్కడ ఓ వ్యక్తి వీరిద్దరినీ చంపాలని అనుకుంటాడు. అయితే వారు ఎలాగో అతడి బారి నుంచి తప్పించుకుంటారు. తరువాత అర్జున్ కు తెలియకుండా అక్కడ స్థానికంగా ఉండే లారీ డ్రైవర్ హెల్ప్ అడుగుతుంది వృషాలి. ఈ క్రమంలో ఆ డ్రైవర్ అర్జున్ ను కొట్టి డ్రైవర్, క్లీనర్ కలసి వృషాలిని ఎత్తుకుపోయి అత్యాచారం చేయాలి అనుకుంటారు. ఈ క్రమంలో అర్జున్ వచ్చి వారి బారి నుంచి వృషాలిని కాపాడుతాడు. అయితే వారిపై దాడి చేసింది ఎవరు.. వృషాలిని అర్జున్ ఎందుకు కాపాడుతాడు.. వృషాలిని కరణ్ పెళ్లి చేసుకోవాలనుకుంటే.. అర్జున్ ఎందుకు బంధిస్తాడు.. అన్న వివరాలు తెలియాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
మహాభారతంలో ఉండే కర్ణుడు, అర్జునుడు అనే లైన్ తీసుకుని దర్శకుడు మోహన్ శ్రీవత్స కథ రాసుకున్నారు. దాన్ని ఇప్పటి జనరేషన్‌కు అనుగుణంగా మార్చి తెరకెక్కించారు. ఈ క్రమంలోనే అందులో ఆయన విజయవంతం అయ్యారు. ఒకరేమో అమ్మ కోసం తపిస్తారు. ఇంకొకరు అమ్మాయి కోసం ఆరాటపడతారు. దీంతో సినిమా సీన్స్ అద్భుతంగా వచ్చాయి. క్లైమాక్స్ కూడా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక హీరోయిన్ షిఫా కూడా తన అందం, నటనతో ఆకట్టుకుంటుంది. తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి.
అలాగే తల్లి పాత్రలో నటించిన అనీత చౌదరి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి తన పాత్ర పరిధి మేరకు నటించింది. మిగిలిన వారంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. మొత్తంగా చెప్పాలంటే కరణ్ అర్జున్ సినిమా ఎంతో థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…