Kamal Haasan : తమిళ స్టార్ హీరోలలో లోకనాయకుడు కమల్ హాసన్ పేరు తప్పక ఉంటుంది. ప్రేక్షకులకి సరికొత్త వినోదం అందించిన కమల్ హాసన్ ఇప్పుడు బుల్లితెరపై హోస్ట్‌గా కూడా అదరగొడుతున్నారు. తమిళ బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తూనే మరో వైపు రాజకీయాలలోను సత్తా చాటుతున్నారు. అయితే సకలకళావల్లభుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఇప్పుడు ఫ్యాషన్ వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు.
తన ఫ్యాషన్ లేబుల్ `హౌస్ ఆఫ్ ఖద్దర్` ను నవంబర్ లో ప్రారంభించనున్నారు కమల్. అమెరికా- చికాగోలో హౌస్ ఆఫ్ ఖద్దర్ మొదటి స్టోర్ ను ప్రారంభించడం ద్వారా భారతీయ చేనేత ప్రాశస్త్యాన్ని విదేశాలకు విస్తరిస్తున్నారు. చేనేత దుస్తులు సహా ఉపకరణాలకు గ్లోబల్ ప్లాట్ ఫామ్ ఇవ్వాలని కమల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమృత రామ్ ఈ దుస్తులను రూపొందించారు.
ఖాదీ మన చరిత్రతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఈ ఉత్పత్తిని వ్యాపారం చేయగలుగుతున్నందుకు గర్వపడుతున్నాము. చక్కని సౌకర్యం దృక్కోణంలో ఖాది అనేది అన్ని వాతావరణాలకు అనుకూలమైన వస్త్రాలు. ఇది వేసవిలో ఎంతో చల్లదనాన్నిచ్చి చెమటను పీల్చే వస్త్రం. అందమైన కళను సృష్టించే చేనేత కార్మికులు, కళాకారులను బాగు చేసే ప్రయత్నం చేస్తాం“ అని కమల్ ప్రకటించారు. అయితే కమల్ లాంటి పెద్ద స్టార్ బట్టల వ్యాపారం చేయడమేంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విక్రమ్ అనే సినిమాతో బిజీగా ఉన్న కమల్ త్వరలో ఈ సినిమాను మన ముందుకు తీసుకురానున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…