Sridevi : యూనివర్సల్ స్టార్‌గా పేరుగాంచిన కమల హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎంతో క్రేజ్ ఉంటుంది. అప్పట్లో ఈయన అనేక మంది హీరోయిన్లతో కలిసి సినిమాలు చేశారు. ఈయన చేసిన అనేక మూవీలు హిట్ అయ్యాయి. అయితే అప్పట్లో కమలహాసన్, శ్రీదేవిల జంట అంటే.. ప్రేక్షకులకు బాగా క్రేజ్. వీరి సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. శ్రీదేవి, కమలహాసన్ జంటగా ఏదైనా చిత్రం వచ్చిందంటే.. ప్రేక్షకులు ఎగబడి థియేటర్లలో సినిమాలు చూసేవారు. ఇప్పటికీ వీరి మూవీలు టీవీల్లో వస్తుంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తారు. అంతటి క్రేజ్ ఈ జంటకు ఏర్పడింది.
అయితే అప్పట్లో వీరు అనేక చిత్రాల్లో నటించడమే కాకుండా.. సక్సెస్‌ఫుల్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఓ దశలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అనుకున్నారు. కానీ కమల్ వద్దన్నారట. శ్రీదేవికి జోడీగా కమల్ అయితే బాగుంటారని ఆమె తల్లి ఆశపడిందట. దీంతో ఆయనను ఇదే విషయం అడిగిందట. కానీ కమల్ అందుకు నో చెప్పారట. శ్రీదేవిని తాను తోబుట్టువులా చూస్తానని.. సినిమాల వరకే హీరో హీరోయిన్లు కానీ.. రియల్ లైఫ్‌లో ఆమె సోదరితో సమానం అని కమల్ అన్నారట. దీంతో ఆయన వద్ద ఇక పెళ్లి ప్రస్తావన తేలేదు. అందుకనే ఆయన శ్రీదేవిని వివాహం చేసుకోవాలని అడిగినా కుదరదని చెప్పేశారు.
ఇక ఈ విషయాలను కమల్ స్వయంగా వెల్లడించారు. శ్రీదేవి చనిపోయిన తరువాత ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని, విశేషాలను పంచుకున్నారు. కాగా వీరిద్దరూ కలసి చేసిన ఆకలి రాజ్యం, వసంత కోకిల, ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమాలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రాలు వస్తుంటే ఇప్పటికీ ప్రేక్షకులు కళ్లార్పకుండా చూస్తూనే ఉంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…